నేడు న్యాయ విజ్ఞాన సదస్సు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ఇండియా మి షన్ హైస్కూల్‌లో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారులు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యే ఈ సదస్సులో చట్టాలపై అవగాహణ కల్పిస్తారని వివరించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బీజేపీ శ్రేణుల సంబురాలు
పెద్దపల్లి: సుల్తానాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు శుక్రవారం సంబురాలు ఘనంగా నిర్వహించారు. బిహార్‌లో ఆ పార్టీ ఘన విజ యం సాధించడంపై టపాసులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు కందుల శ్రీనివాస్, కూకట్ల నాగరాజు, చందు సునీల్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, సౌదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్, ఎల్లేంకి రాజన్న, లంక శంకర్, కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


