ర్యాగింగ్‌కు పాల్పడితే కటకటాలే
కోల్‌సిటీ(రామగుండం): ర్యాగింగ్‌కు పాల్పడితే కఠి న చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషన ర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. గోదావరిఖ నిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె స్(సిమ్స్)లో శుక్రవారం యాంటీ ర్యాగింగ్, సైబర్ క్రైంలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ, దేవున్ని ప్రార్థిస్తే వరాలు ఇస్తాడో లే డో కానీ.. వైద్యులను సంప్రదిస్తే ప్రాణం పోస్తార న్నారు. ఇలాంటి గౌరవ వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు. సీ నియర్లు అంతకుముందు జూనియర్లనే విషయాన్ని మర్చిపోవద్దని హితువు పలికారు. ర్యాగింగ్‌కి పా ల్పడితే కేసులు నమోదు చేసి, జైలుశిక్ష విధించడంతోపాటు కాలేజీ నుంచి తొలగిస్తారని వెల్లడించా రు. క్యాంపస్‌లో సీసీ కెమెరాలతో నిఘా ఉందని, ని త్యం పోలీస్ పెట్రోలింగ్, ప్రత్యేక నిఘా కొనసాగుతుందని సీపీ తెలిపారు. డ్రగ్స్. గంజాయి వినియోగంతో కలిగే సమస్యలు, చట్టపరమైన శిక్షలపై సీపీ అవగాహన కల్పించారు. సైబర్ నేరాల నియంత్రణపైనా వివరించారు. సైబర్ నేరాల బారినపడితే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని, ఏ సమస్య ఎదురైనా డయల్ 100 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. సిమ్స్ ప్రిన్సిపాల్ నరేందర్, అడిషనల్ డీఎంఈ హిమబింద్‌సింగ్, గోదావరిఖని, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీలు రమేశ్, నాగేంద్రగౌడ్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎన్‌జీవో ప్రతినిధురాలు సునీత, ఎస్సైలు అనూష, లావణ్య, ప్రొఫెసర్లు, మెడికోలు పాల్గొన్నారు.


