విద్యుత్ రంగంలో ఎన్టీపీసీ అగ్రస్థానం
జ్యోతినగర్(రామగుండం): విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఎన్టీపీసీ మనదేశంలోనే అగ్రస్థానంలో ఉందని, దక్షిణాదిలో రామగుండం–తెలంగాణ ఎన్టీపీసీ మొ దటి స్థానంలో నిలిచిందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డై రెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. రామగుండం ఎన్టీపీసీ 48వ ఆవిర్భావ వేడుకలు స్థానిక పరిపాలన భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈడీ పతాకం ఆవిష్కరించి, కేక్ కట్ చేసి మాట్లాడా రు. 48ఏళ్ల ఉత్సాహం, ఆవిష్కరణ, దేశ నిర్మాణంలో పోటీతత్వం రామగుండం గొప్పతనంలో మరో అద్భుతమన్నారు. పీటీఎస్‌లో 2.4 మెగావాట్ల గ్రౌండ్ మౌంట్, 1.8 మెగావాట్ల రూప్‌టాప్ సోలార్ ప్లాంటు నిర్మిస్తున్నామని తెలిపారు. 100 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. కార్పొనేట్ యాష్ బ్రిక్స్ ప్లాంట్‌లో రోజూ 2 లక్షల ఇటుకలు తయారు చేసే లా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతల కు బహుమతులు అందించారు. జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగ ప్రతినిధులు పాల్గొన్నారు.


