‘తియ్యని’ మార్పు
లక్షణాలు ఇవే..
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
కిడ్నీలపై ప్రభావం
● జీవనశైలిని మార్చిన డయాబెటిస్
● సిరిధాన్యాలపై జనం మక్కువ
● కూరగాయలు, పండ్లకు పెరిగిన గిరాకీ
● నేడు వరల్డ్ డయాబెటిస్ డే
● మారిన జీవనశైలితో ముప్పు
ప్రస్తుతం ఒత్తిడి పెరగడం, ఆహార నియమాలు పాటించకపోవడంతో యుక్తవయసులోనే మధుమేహం బారిన పడుతున్నారు. నాలుగు పదుల వయసులోనే గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. సైలెంట్ కిల్లర్‌గా పేరుఉన్న షుగర్‌కు చెక్ పెట్టేందుకు అత్యధునిక మందులు అందుబాటులోకి వచ్చాయి. దుష్ఫలితాలపైనా పనిచేస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
● ఉమ్మడి జిల్లాలో 7 లక్షల మంది బాధితులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 7 లక్షల మంది వరకు షుగర్ బాధితులు ఉన్నట్లు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 24,204 మంది ఉన్నారని డీఎంహెచ్‌వో వాణిశ్రీ తెలిపారు. ఎన్సీడీ 2023–24లో చేపట్టిన సర్వే లో కరీంనగర్ జిల్లా జనాభా 10.5 లక్షలు ఉంటే.. ఇందులో 2.10 లక్షల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరికొందరు బాధితులు ఉన్నారు.
● వ్యాధికి కారణాలు..
మధుమేహం రావడానికి ప్రధానంగా ఇన్ఫెక్షన్లని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్ఫెక్షన్‌తో అది దెబ్బతిని ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచి వ్యాధి సోకుతుంది. పుట్టుకతో వచ్చే జన్యుపరమైన కారణాలతోపాటు జంక్‌ఫుడ్, వ్యాయామం లేకపోవడం, బరువు పెరగడం, స్థూలకాయం, మానసిక ఒత్తిడితోనూ మధుమేహం బారినపడతారు.
● పెరుగుతున్న అవగాహన..
షుగర్‌పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఆహారంలో సిరిధాన్యాలు, రాగులు, జొన్నలు, గోధుమలు, కూరగాయలు, పండ్లు చేర్చుకుంటున్నారు. మధుమేహం నియంత్రణకు జొన్నరొట్టెలు బాగా పనిచేస్తాయని తెలియడంతో చాలా మంది వీటిని తినేందుకు మొగ్గుచూపుతున్నారు. ఉసిరికాయలు, నేరేడు, జామపండ్లకూ గిరాకీ పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని అంబలి, రాగి జావ, రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి పూరీలు, ఫ్రూట్ జ్యూస్ విక్రయ షాపులు రద్దీగా మారాయి.
తరచుగా మూత్ర విసర్జన, దాహం వేయడం, ఆకలి, బరువు తగ్గడం, నీరసం, పిల్లలు రాత్రివేళల్లో పక్కతడపడం వంటివి షుగర్ లక్షణాలు. షుగర్ బారినపడిన పిల్లలైతే జీవితాంతం ఇన్సులిన్ వాడాలి. పెద్దల్లో తరచూ దాహం వేసినట్లు ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్లడం, చూపు మసకబారడం, అలసట, కొందరిలో శృంగార కోరికలు తగ్గడం, కాళ్లలో స్పర్శ లోపించడం, తిమ్మిర్లు రావడం, అతిఆకలి, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఆయాసం, వాంతులు, విరోచనాలు, మర్మాయవాల వద్ద ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
మధుమేహ బాధితులు అశాసీ్త్రయ పద్ధతి ద్వారా షుగర్‌ను నియంత్రించుకునే ప్రయోగాలు చేయవద్దు. క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఆలస్యంగా ఆహారం తీసుకోవడం, ఆలస్యంగా నిద్రపోవడం మంచిది కాదు. వైద్యుని సలహా లేకుండా నెలల తరబడి మందులు వాడొద్దు. రక్తపోటు, షుగర్, కొలస్ట్రాల్, కళ్లు, గుండె, కిడ్నీ పరీక్షలు ఏటా చేయించుకోవాలి.
కరీంనగర్ జిల్లాలో రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో షుగర్ బరినపడేవారు సుమారు లక్ష మంది ఉన్నారు. షుగర్‌తోపాటుగా 100 మందిలో 30 మందికి అధిక రక్తపోటు (హైబీపీ) ఉంది. డయాబెటిస్‌తో కిడ్నీలు దెబ్బ తింటాయి. హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. వైద్యుల సహాలతో క్రమం తప్పకుండా మందులు వాడాలి.
– వెంకటరమణ, వైద్యాధికారి, కరీంనగర్
కోల్‌సిటీ/కరీంనగర్: గతంలో జొన్న, రాగిసంకటి పేదోడి ఆహారం. కొర్రలు, ఊదలు, అరికెలు వంటి సిరిధాన్యాలు పేదోళ్ల ఇళ్లలోనే వండేవారు. కాయకష్టం చేసేవారికి ఇదే బలవర్ధకమైన ఆహారం. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఇవన్నీ ఇప్పుడు ధనికుల ఇళ్లల్లోనే ఉంటున్నాయి. షుగర్(మధుమేహం) కాలాన్ని తిరగేస్తోంది. మనుషులనూ మార్చుతోంది. షుగర్‌తో జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా గత ఆహార నియమాలకు ప్రాధాన్యం పెరిగుతోంది. ఈనెల 14న వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..
‘తియ్యని’ మార్పు


