క్రీడలతో నూతన ఉత్సాహం
మణుగూరుటౌన్: నిత్యం విధుల్లో తలమునకలయ్యే సింగరేణి కార్మికులు.. క్రీడలు, యోగా వైపు దృష్టి సారిస్తే ఆరోగ్యానికి శ్రేయస్కరమేగాక నూతన ఉత్సాహం లభిస్తుందని మణుగూరు ఏరియా ఇన్‌చార్జి జీఎం ఎం.రమేశ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కంపెనీ స్థాయి హాకీ టోర్నమెంట్ ముగింపు సమావేశంలో ఆయన బహుమతులు అందజేసి మాట్లాడారు. ఉద్యోగ క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయిలో విజయపతాక ఎగురవేయాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో ఆర్‌జీ–3, భూపాలపల్లి జట్లు విజేతగా నిలవగా, ఆర్‌జీ–1, ఆర్‌జీ–2 జట్లు రన్నరప్‌గా నిలిచాయి.


