భక్తులకు సౌకర్యాలు కల్పించండి
● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్
● కొండగట్టులో ఆర్జిత సేవా రుసుం పెంచడంపై ఆగ్రహం
కరీంనగర్: కొండగట్టులో సౌకర్యాలు కల్పించకుండానే ఆర్జిత సేవా రుసుం భారీగా పెంచడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతుంటే.. ఆర్జిత సేవా రుసుం పేరుతో అడ్డగోలుగా ధరలు పెంచడమేంటని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ గురువారం దేవాదాయశాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పెంచిన ఆర్జిత సేవా రుసుం తగ్గించాలని, భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్–1 డిపో ద్వారా పుణ్యక్షేత్రలైన ఏడుపాయల, స్వర్ణగిరి, బంగారు శివలింగం, యాదగిరి గుట్టకు ప్ర త్యేక సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 16న ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ విజయమాధురి తెలి పారు. ఈ బస్సు 16న ఉదయం 3.30గంటలకు కరీంనగర్ బస్‌స్టేషన్ నుంచి బయలుదేరి దర్శనాల అనంతరం అదేరోజు రాత్రి కరీంనగర్ చే రుకుంటుందని అన్నారు. పెద్దలకు రూ.1,150, పిల్లలకు రూ.880 టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు 73828 49352, 99592 25920, 80746 90491 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
16న ప్రతిభా పరీక్ష
విద్యానగర్(కరీంనగర్): పదో తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు, వారి కి ఉన్నత విద్యావకాశాలతో పాటు మంచి భవి ష్యత్ అందించడానికి ఈనెల 16న ప్రతిభా పరీ క్ష నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. గురువారం ప్రతిభా పరీక్షలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. జ్యోతినగర్‌లోని ఎస్‌ఆర్ జూని యర్ కాలేజీలో బాలికలకు, ముకరంపురలోని ఎస్‌ఆర్ కాలేజీలో బాలురకు ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇంటర్‌లో ఉచిత ప్రవేశంతో పాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కోచింగ్. ప్రోత్సాహక స్కాలర్‌షిప్ అందజేయనున్నట్లు తెలిపారు. వివరాలకు ఎస్‌ఆర్ కాలేజీ లేదా 9154854706, 9642117366 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మల్లాపూర్: ఉన్న ఊరిలో ఉపాధి లేక కట్టుకున్న భార్యాపిల్లలు, కన్న తల్లిదండ్రులను వదిలి ఏడారి దేశానికి వలస వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు. 36రోజులకు మృతదేహాం గురువారం స్వదేశానికి చేరుకుంది. మల్లాపూర్ మండలంలోని వాల్గొండతండాకు చెందిన లకావత్ రమేశ్ (45) కుటుంబ అవసరాలకు అప్పులు చేశాడు. ఏడాది క్రితం దుబాయి వెళ్లాడు. గతనెల 8న విధులు నిర్వర్తించి రూమ్‌కు చేరుకుని నిద్రిస్తుండగా గుండెపోటు వచ్చి మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు స్థానికులు, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు ఎంబసీ అధికారులతో మాట్లాడారు. 36 రోజుల అనంతరం రమేశ్ మృతదేహం స్వదేశానికి చేరింది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. రమేశ్‌కు భార్య పద్మ, కుమార్తె వసంత, కుమారుడు హర్షిత్ ఉన్నారు.
మృతదేహం కోసం 22 రోజులుగా ఎదురుచూపు
పెగడపల్లి: విదేశాలకు వె ళ్లిన ఇంటిపెద్ద బాగా సంపాదిస్తాడనుకున్న ఆ కు టుంబానికి చుక్కెదురైంది. ఇంటికి వచ్చేందుకు విమా నం టికెట్ బుక్ చేసుకున్న ఆయన.. తెల్లారితే తమ క ళ్లముందు ఉంటాడని భావించిన కుటుంబసభ్యులకు పిడుగులాంటి వార్త తెల్సింది. గుండెపోటుతో మరణించాడని తెలియడంతో శోకసంద్రంలో మునిగింది. మృతదేహం రాకకోసం 22రోజులుగా నిరీక్షిస్తోంది. పెగడపల్లి మండలకేంద్రానికి లింగంపల్లి రమేశ్ (55)ఇరాక్‌లో 22 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక చొరవ చూపాలని ఆ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.


