పట్టాలపై పట్టు సడలకుండా..
రామగుండం: రైల్వేపట్టాలపై శీతాకాలంలో కురిసే మంచు, వానాకాలంలో నిలిచే వర్షపునీరు గూడ్స్ రైళ్లు ముందుకు సాగకుండా అవాంతరాలు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బరువుతో కూడుకున్న వ్యాగన్లు కావడంతో మంచు, వర్షపునీరు పట్టాలపై నిలిచి చక్రాలు పట్టుసడలి పోతాయని, తద్వారా వేగం తగ్గుతుందని, ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లోనూ ఇదేపరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు లోకోమోటివ్ కంటైనర్(రైలింజన్ వెనకాల ఉండే వ్యాగన్)లో ఇసుక నింపిఉంచుతారు. సమస్య ఎదురైన చోట లోకో పైలెట్ స్విచ్ ఆన్‌చేస్తే కంప్రెస్డ్ ఎయిర్ పైపు ద్వారా పట్టాలపై ఇసుక నేరుగా పడి రైలు వేగంగా ముందుకు కదిలేలా సాయపడుతుంది. రైలు హాల్టింగ్ తర్వాత ఆరంభదశలో కంప్రెస్డ్ విధానంతో ఇసుకను పట్టాలపై చల్లించాక రైలింజన్‌ను ముందుకు కదిలిస్తే చక్రాలకు పట్టు దొరికి వేగం పుంజుకుంటుంది.
రైల్వేస్టేషన్లలో ఇసుక నిల్వలు..
ప్రధాన రైల్వేస్టేషన్లలోని ఇరువైపులా లోకోమోటివ్ నిలిచే ప్రదేశానికి సమీపంలో రెండు సీజన్లలోనూ ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచుతున్నారు. లోకోమోటివ్‌లో ఇసుక నిల్వలు తరిగిపోతే.. లోకో పైలెట్ గుర్తించి ముందస్తుగా క్య్రూకంట్రోలర్ కార్యాలయానికి సమాచారం అందిస్తారు. గూడ్స్.. రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే చిన్నసంచుల్లో నిల్వచేసిన ఇసుకను సాండ్‌బాయ్ సాయంతో లోకోమోటివ్ కంటైనర్‌లో నింపుతారు. లోకో పైలెట్ విధుల్లో చేరేసమయంలోనే కంటైనర్‌లో ఇసుక నిల్వలను తనిఖీ చేయాల్సి ఉంటంది. ప్రస్తుతం బల్హార్షా– కాజీపేట మధ్య ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇసుక నిల్వలను పెద్దఎత్తున ఏర్పాటు చేశారు.
ÌZMø-Ððl*-sìæÐŒæ MýS…Osñæ-¯]l-ÆŠ‡ÌZ˘ CçÜ$MýS °ÌSÓË$
గూడ్స్‌రైళ్లు ముందుకు వెళ్లేలా ట్రాక్‌పైకి..
ప్రధాన రైల్వేస్టేషన్లలో అందుబాటులో ఇసుక సంచులు


