రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని పద్మనగర్ బైపాస్ రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం చింతకుంటలోని రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్న గడ్డం ఈశ్వరయ్య(34) పెయింటింగ్ కాంట్రాక్టు చేస్తుంటాడు. రోజూ పెయింటింగ్ పనిపై నగరానికి వస్తుంటాడు. ఈక్రమంలో గురువారం ఈశ్వరయ్య మిత్రుడు చిరంజీవితో పాటు బైక్‌పై వెనుక కూర్చొని చింతకుంట నుంచి కరీంనగర్‌కు వెళ్తుండగా పద్మనగర్ బైపాస్ రోడ్డు వద్దకు రాగానే వెనుకనుండి వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈశ్వరయ్య లారీ టైర్ కిందపడి మృతిచెందగా చిరంజీవికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈశ్వరయ్య భార్య గడ్డం అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.
పెద్దబొంకూరులో రెండిళ్లలో చోరీ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో తాళం వేసిన ఇళ్లలో గురువారం తెల్లవారు జామున దొంగలు చొరబడ్డారు. గ్రామంలోని వేముల రమేశ్ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లోకి దూరిన దొంగలు.. బీరువాలు పగులగొట్టి అర్ధతులం బంగారం, రూ.5వేల నగదు ఎత్తుకెళ్లార ని బాధితుడు రమేశ్ తెలిపారు. మరోవ్యక్తి ఇంట్లోకూడా దొంగలు చొరబడ్డారని ద్వారా తెలిసింది. కా గా, తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు.. ఎవరూ లేనిసమయంలో దొంగతనాలకు పాల్ప డు తున్నారు. గ్రామస్తులు సీసీ కెమెరాలు బిగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.


