నత్తే నయం
న్యూస్‌రీల్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం ముగ్గుపోయని లబ్ధిదారులు 1,016 మంది పూర్తయిన ఇళ్లు 257 లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.57 కోట్లు జమ అసంపూర్తి పనులపై అధికారుల దృష్టి
శుక్రవారం శ్రీ 14 శ్రీ నవంబర్ శ్రీ 2025
సాక్షి పెద్దపల్లి: పేదల సొంతింటి కల సాకారం చే యాలన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. అయితే, పనులు ప్రారంభించడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. తొలివిడుతలో ప్రతీనియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించింది. పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలాలకు మోడల్ ఇళ్లు మంజూరు చేసింది. తొలివిడతలో 13 మండలాల్లో ఒక్కోగ్రామాన్ని ఎంపిక చేసి 1,935 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసింది. ఎంపికై న ప్రతీ లబ్ధిదారు ఇంటి నిర్మాణం ప్రారంభించా ల్సి ఉండగా, ఇప్పటివరకు 1,016 మంది ముగ్గు కూడా పోయలేదు. 257 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. వివిధ దశల్లోని 3,000 మంది ఇళ్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.57కోట్లు జమచేసింది.
కారణాలు అనేకం
ప్రభుత్వం రూ.5లక్షలు ఒక్కో ఇంటికి దశలవారీగా మంజూరు చేస్తోంది. నిర్మాణ ఖర్చు పెరగకుండా లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తోంది. అలాగే నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించేలా జిల్లాస్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో తహసీల్దార్లతో కమిటీలను కూడా ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. క్షేత్రస్థా యిలో కమిటీలు నామమాత్రం కావడంతో వ్యాపారులు, మేసీ్త్రలు అడిగినంత చెల్లించాల్సి వస్తోంది. ఫతితంగా నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
ఉపాధిహామీ అనుసంధానం చేసినా..
గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూలీల కొ రత లేకుండా లబ్ధిదారుని కుటుంబం పనిచేసుకుని కూలి పొందడంతోపాటు నిర్మాణం వేగవంతంగా పూర్తయ్యేలా అనుసంధానం చేశారు. ఉపాధిహామీ పథకంలో జాబుకార్డు ఉన్న లబ్ధిదారుకు బేస్‌మెంట్‌స్థాయి వరకు 40 రోజులు, స్లాబ్ స్థాయి వరకు 50 రోజుల పనిదినాలు కల్పిస్తున్నారు. 90 రోజుల పనిదినాలు చేసిన లబ్ధిదారులకు కూలి కింద సొమ్ము చెల్లించనున్నారు. జిల్లాలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి మహిళా సంఘాల ద్వారా 1,100 మంది లబ్ధిదారులకు తోడ్పాటు అందించినా.. చాలామంది ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఆన్‌లైన్ చేయడంలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలతో బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం నెలకొనడం కూడా ఇళ్ల నిర్మాణ ప్రగతికి అడ్డంకిగా మారుతోందని అంటున్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి ఇలా..
నత్తే నయం
నత్తే నయం
నత్తే నయం


