విద్యార్థుల ప్రతిభకు వేదిక ఫ్రెషర్స్ డే
రామగిరి(మంథని): ఫ్రెషర్స్ డే విద్యార్థుల ప్రతిభ, ఉత్సాహానికి వేదికగా నిలుస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ప న్నూర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో మంథని జే ఎన్టీయూ ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఫ్రెషర్స్ డేకు సీపీ ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. కాలేజీకి ఏటా వచ్చే ఒ క్కో విద్యార్థి బండిల్ ఆఫ్ ట్యాలెంట్‌తో ఉంటాడ న్నారు. ప్రారంభంలో సవాళ్లుగా అనిపించినా క్రమశిక్షణ, విలువలు, సృజానత్మకత, ఆవిష్కరణలతో ముందుకు సాగితేనే మంచి భవిష్యత్‌కు పునాది పడుతుందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించాలని సూచించారు. శ్రద్ధతో చదివితే సునాయాసంగా లక్ష్యం చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. జేఎన్టీయూహెచ్ డైరెక్టర్ కామాక్షి ప్రసాద్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీసీ రమేశ్, వైస్ ప్రిన్సిపాల్ ఉదయ్‌కుమార్, పరిపాలనాధికారి సుమన్‌రెడ్డి, మంథని సీఐ రాజు, ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


