నృసింహుని ఆదాయం రూ.16 లక్షలు
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర హుండీ ఆదాయాన్ని గురు వారం లెక్కించారు. శ్రీవల్లి సేవాసంస్థ సభ్యులు తదితరులు లెక్కించగా.. రూ.16,07,218 ఆదా యం సమకూరిందని ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య తెలిపారు. ఇందులో రూ.68,400 తైబజార్, రూ.2,55,065 సేవా టికెట్లు, రూ.6,01,000 వేలం, రూ.6,82,753 హుండీ ద్వారా ఆదాయం సమకూరిందని ఈవో వివరించారు. మూడు గ్రా ముల బంగారం, 365గ్రాముల వెండిని భక్తులు కట్న, కానుకల రూపంలో సమర్పించారని ఆయన పేర్కొన్నారు. పలువురు సిబ్బంది పాల్గొన్నారు.


