రేపు యూనిటీ మార్చ్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు యూనిటీ మార్చ్‌

Nov 14 2025 5:57 AM | Updated on Nov 14 2025 5:57 AM

రేపు

రేపు యూనిటీ మార్చ్‌

పెద్దపల్లి: సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని ఈనెల 15న యూనిటీ మార్చ్‌ నిర్వహిస్తామని అదనపు కలెక్టర్‌ వేణు తెలిపారు. తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. జిల్లావ్యాప్తంగా చేపట్టే యూనిటీ మార్చ్‌ను అందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ నుంచి ప్రభు త్వ జూనియర్‌ కళాశాల వరకు మార్చ్‌ కొనసాగుతుందని, యువత భారీగా తరలిరావాలని ఆయన కోరారు. అనంతరం ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించారు. జిల్లా యువజన శాఖ అధికారులు సురేశ్‌, వెంకట్‌ రాంబాబు, ప్రిన్సిపాల్స్‌ రవీందర్‌రెడ్డి, నీతారెడ్డి, సీఐ ప్రవీణ్‌ కుమార్‌, ఎన్‌సీసీ అధికారి ధ్రువకుమార్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

ధర్మారం(ధర్మపురి): రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికై న స్థానిక మోడల్‌ స్కూల్‌ విద్యార్థులను పీఈటీ బైకని కొమురయ్య తదితరులు గురువారం అభినందించారు. జిల్లా తరఫున అండర్‌– 17 బాలికలులో తుమ్మల మనోజ్ఞ, ట్రిబుల్‌జంప్‌లో ప్రథమ, లాంగ్‌జంప్‌లో ద్వితీయ, అండర్‌ –17లో సంపతి రక్షిత హ్యామార్‌త్రో ప్రథమ, డిస్కస్‌త్రోలో ద్వితీయ, అండర్‌ –17 ట్రిబుల్‌ జంప్‌లో ద్వితీయ స్థానం సాధించినట్లు కొమురయ్య వివరించారు. ఫుట్‌బాల్‌ పోటీల్లో బత్రి ఆశ్రిత, ఎన్‌.సంధ్య రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఆయన తెలిపారు. ప్రిన్సిపాల్‌ రాజ్‌కుమార్‌, పీఈటీలు కొమురయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

నాణ్యతతోనే భవిష్యత్‌

గోదావరిఖని: నాణ్యతతోనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని సింగరేణి ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ ఎల్‌ వీ సూర్యనారాయణ అన్నారు. జీడీకే–5 ఓసీపీలో గురువారం జెండా ఎగురవేసి బొగ్గు నా ణ్యత వారోత్సవాలు ప్రారంభించారు. పోటీ మార్కెట్‌లో బొగ్గు నాణ్యతకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలని ఆయన సూచించారు. వినియోగదారులను కాపాడుకునేందుకు ప్రతీఒక్కరు కృషి చేయాలని కోరారు. ఆర్జీవన్‌ జీఎం లలిత్‌కుమార్‌, క్వాలిటీ జీఎం ముజుందార్‌, సేఫ్టీ రీజియన్‌ జీఎం మధుసూదన్‌, ఏఐటీయూసీ నాయకుడు మడ్డి ఎల్లాగౌడ్‌, సీఎంవో ఏఐ ఉపాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్‌, ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్‌, ప్రాజెక్టు అధికారి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్జీ–2లోని సీహెచ్‌పీ, ఓసీపీ క్వారీని సూర్యనారాయణ పరిశీలించారు. జీఎం వెంకటయ్య, ఎస్‌వోటూ జీఎం రాముడు, సేఫ్టీ ఆఫీసర్‌ సంతోష్‌కుమార్‌, ఏరియా ఇంజినీర్‌ సుజన్‌మెహార్‌, ప్రాజెక్టు అధికారి ఉదయ్‌హరిజన్‌ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

బాధ్యతలు స్వీకరణ

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభు త్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌) ఆర్‌ఎంవోగా డాక్టర్‌ కృపాబాయి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు సివిల్‌ సర్జన్‌ హోదాగా పదోన్నతి కల్పించడంతోపాటు గోదావరిఖని ఆర్‌ఎంవోగా ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో పలువురు వైద్యసిబ్బంది ఆర్‌ఎంవోను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మేరీ సుశీల, సువర్ణ, గ్రేస్‌, నవీన్‌, అశోక్‌, రాధిక, జ్యోతి పాల్గొన్నారు.

పత్తి ధర రూ.6,718

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,718గా ధర నమోదైంది. కనిష్టంగా రూ.5,352గా, సగటు రూ.6,444గా ఉందని మార్కెట్‌ కార్యదర్శి మనోహర్‌ తెలిపారు. ఈ సందర్భంగా 1,323 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.

రేపు యూనిటీ మార్చ్‌ 
1
1/1

రేపు యూనిటీ మార్చ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement