వార్డు ఆఫీసర్లకు ట్యాబ్‌లు
● క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించాలి ● రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ
కోల్‌సిటీ(రామగుండం): క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలో వార్డు ఆఫీసర్లు కీలక పాత్ర నిర్వహించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ ఆదేశించారు. గురువారం బల్ది యా కార్యాలయంలో వార్డు ఆఫీసర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మా ట్లాడుతూ, నగరవాసులకు మెరుగైన సేవలు అందించడానికి, సాంకేతిక సహకారం కోసం ట్యాబ్‌లు అందజేశామన్నారు. జియోట్యాగింగ్ చేయడం, సర్వేల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, యాప్‌లో సమస్యల పరిశీలన, పరిష్కా రం వంటి బహుళ సేవలకు ఈ ట్యాబ్‌లు ఉపయోగపడతా యని తెలిపారు. ప్రజలు కూడా తమ సమస్యలను వార్డు అధికారులకు స్వయంగా లేదా ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఈసందర్భంగా నల్లా కనెక్షన్ వివరాలు ఫొటోలు, డాక్యుమెంట్లు అమృతమ్ యాప్‌లో నమోదు చేయడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ గురువీర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


