సజావుగా భూ సేకరణ
● పెండింగ్ పరిహారం చెల్లించాలి ● వేగంగా నేషనల్ హైవే నిర్మాణం ● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
రామగిరి(మంథని): భూ సేకరణ ప్రక్రియ సజావు గా సాగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్ట ర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సింగరేణి పెండింగ్ భూసేకరణ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో గురువ రం ఆయన సమీక్షించారు. బుధవారంపేట, రాజాపూర్, ఆదివారంపేట గ్రామాల్లో సింగరేణి సంస్థకు అవసరమైన భూసేకరణ వివరాలపై నివేదికను తనకు అందించారని కలెక్టర్ అన్నారు. ఎస్‌డీసీ, ఎంపీడీవో, తహసీల్దార్, సింగరేణి అధికారులు సమ న్వయంతో పనిచేస్తూ భూసేకరణ సజావుగా సాగే లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారికి సంబంధించి నిర్వాసితులకు పెండింగ్ పరిహారం చెల్లింపులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. హైవే పనుల్లో వేగం పెంచా లని అన్నారు. మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి సురేశ్, సింగరేణి రామగుండం–3 జనరల్ మేనేజర్ సుధాకర్‌రావు, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో శైలజారాణి, సింగరేణి, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఐలయ్య, శ్యామల, ఉమేశ్, మౌనిక, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


