కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులు మద్దతు ధరకు విక్రయించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. వెన్నంపల్లి, మీర్జంపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం డబ్బులను 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారని అన్నారు. ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, సీఈవోలు కోలేటి శ్రీనివాస్, విజేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మాజీ ప్రజాప్రతినిధులు సతీశ్, సదానందం, రమేశ్, మల్లయ్య, రైతులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం
జూలపల్లి(పెద్దపల్లి): రైతుల సంక్షేమమే ప్రజాప్రభు త్వ లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభిస్తున్నట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. వివిధ గ్రామాల్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మాట్లాడారు. నాయకులు, ప్రతినిధులు వేణుగోపాలరావు, కంది మల్లారెడ్డి, స్రవంతి, అంజయ్య, సంతోష్, మల్ల య్య, లోక జలపతిరెడ్డి, బొజ్జ శ్రీనివాస్, తొంటి మధుకర్, రవీందర్‌రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.


