రిజర్వేషన్ల సాధనకు పోరాటం
పెద్దపల్లి: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేదిలేదని బీసీ జేఏసీ చైర్‌పర్సన్ దాసరి ఉష అన్నారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పో రాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ తరహాలో రిజ ర్వేషన్ల సాధనకు ఉద్యమిస్తామన్నారు. నాయకులు ఎన్.శంకర్, కొండి సతీశ్, చిలారపు పర్వతాలు, ఆకుల వివేక్ పటేల్, ఎస్.స్వప్న, ఎస్.కొమరయ్య, ఎన్.రాజేందర్, కె.నవీన్‌యాదవ్, డి.రామస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ దీక్షకు మద్దతు ప్రకటించారు.
నేడు రామగుండం ఎన్టీపీసీ ఆవిర్భావ వేడుకలు
జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు 48వ ఆవిర్భావ వేడుకలను శుక్రవారం నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. స్థానిక పరిపాలనా భవనంలో ఉదయం 8.55 గంటలకు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత, సీఐఎస్‌ఎఫ్ అధికారులతో కలిసి జెండా వందనం చేసి వేడుకలను ప్రారంభిస్తారు. వివిధ కార్యక్రమాలు చేపడతారు.


