17న కలెక్టరేట్‌ ఎదుట నిరసన | - | Sakshi
Sakshi News home page

17న కలెక్టరేట్‌ ఎదుట నిరసన

Nov 14 2025 5:57 AM | Updated on Nov 14 2025 5:57 AM

17న కలెక్టరేట్‌ ఎదుట నిరసన

17న కలెక్టరేట్‌ ఎదుట నిరసన

పెద్దపల్లి: విద్యుదాఘాతంతో మృత్యువాతపడుతు న్న గొర్రెలు, మేకలకు పరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో ఈనెల 17న కలెక్టరేట్‌ ఎదుట చేపట్టే నిరసనను విజయవంతం చేయాలని గొర్రెకాపరుల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతియాదవ్‌, ఉపాధ్యక్షుడు చిలారాపు పర్వతాలు కో రారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యంతో గొర్రెలు, మేకలు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇందుకు అరకొరగా పరిహారం చెల్లి స్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. కాపరి చనిపోతే రూ.25 లక్షలు, గొర్రెకు రూ.20వేలు, పొట్టేలుకు రూ.30వేల పరిహారం చెల్లించాలని, తక్షణ సాయంగా రూ.5లక్షలు అందించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు సలేంద్ర రాములు యాదవ్‌, వేల్పుల నాగరాజు, మేకల న ర్సయ్య, దారం రాజుయాదవ్‌, బత్తుల లింగంయాదవ్‌, దాడి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement