దాహం తీరేదెలా? | - | Sakshi
Sakshi News home page

దాహం తీరేదెలా?

Nov 13 2025 8:14 AM | Updated on Nov 13 2025 8:14 AM

దాహం

దాహం తీరేదెలా?

గోదావరిఖని: వర్షకాలంలో మురుగునీరు.. వేసవి లో కలుషిత నీరు.. ఇలా రెండు సీజన్లలో సింగరేణి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు లభించడమే లేదు. ఈ నీరుతాగుతూ అనేకమంది అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కార్మిక కు టుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ర్యాపిడ్‌ గ్రావిటీ ఫిల్టర్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు సింగ రేణి యాజమాన్యం రూ.25కోట్లు మంజూరు చేసింది. గతేడాది మార్చిలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమా ర్క పనులు ప్రారంభించారు. వాస్తవానికి గత ఆగ స్టులోనే ప్లాంట్‌ అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇప్పటివరకు 80శాతం పనులే పూర్తయ్యాయి. సాంకేతిక పనులు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి.

ఇబ్బందుల్లో సుమారు 70 వేల మంది..

సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–1, 2, 3, ఏఎల్‌పీ ఏరియాల్లో విస్తరించి ఉంది. ఆయా ప్రాంతాల్లో కార్మికులు సుమారు 50 వేల మంది, కార్మికేతరులు దాదాపు 20వేల మంది వరకు ఉంటారు. వీరికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.25కోట్లతో ర్యాపిడ్‌గ్రావిటీ ఫిల్టర్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు సింగరేణి నిర్ణయించింది. గతేడాది జూన్‌లో పనులు ప్రారంభించారు. నిర్దేశిత గడువు ఈఏడాది ఆగస్టు. ఆలోగా పనులు పూర్తి కా ల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్‌ మరోమూడు నెలల గడువు కోరారు. దీంతో ఈనెలాఖరు వరకు పనులు పూర్తిచేసి యాజమాన్యానికి అప్పగించాల్సి ఉంది. ప్రస్తుతం ప్లాంట్‌ క్లారిఫ్లాస్క్‌లేటర్‌, ఫిల్టర్‌హౌస్‌, కెమికల్‌ హౌస్‌, క్లోరినేషన్‌ హౌస్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 20శాతం పను లు పూర్తిచేయాల్సి ఉంది. ఇందులోని గ్రీన్‌ వాటర్‌ చాంబర్‌, పైపులైన్‌ డైవర్షన్‌, కాంపౌండ్‌వాల్‌ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు.

నిత్యం 35 ఎంఎల్‌డీ నీటి సరఫరా..

నగర శివారులోని గోదావరినది నుంచి రోజూ 35ఎంఎల్‌డీ(మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే) నీటిని గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీల్లోని కార్మిక, కార్మికేతర కుటుంబాలకు పంపింగ్‌తో పైపులైన్ల ద్వారా అందిస్తోంది. మూడేళ్లకిందట వరకు తాగునీటి సరఫరా బాగానే ఉన్నా.. కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మాణంతో తిప్పలు మొదలయ్యా యి. బ్యాక్‌వాటర్‌తో ఏడాది పొడవునా నదిలో నీటి నిల్వలు పేరుకుపోవడం, నగరంలోంచి వెలువడే డ్రైనేజీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి విడుదలయ్యే రసాయనాలు నేరుగా గోదావరిలో కలుస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. దీనిని తాగిన కార్మిక కుటుంబాలు డయే రియా బారిన పడుతున్నాయి. హైదరాబాద్‌ మహానగరానికీ గోదావరి నుంచే మిషన్‌ భగీరధ ద్వారా ర్యాపిడ్‌ గ్రావిటీ ఫిల్టర్లు ఏర్పాటు చేసి నీటిని శుద్ధిచేసి సరఫరా చేస్తున్నారు. ఇదే పద్ధతిన సింగరేణి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే డిమాండ్‌ పెరిగింది. ఈమేరకు అప్పటి సీఎండీ శ్రీధర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేశా రు. ఆర్జీ–1 ఏరియా జీడీకే –1, 3గని ఫ్యాన్‌హౌస్‌ సమీపంలో 35 ఎంఎల్‌డీ సామర్థ్యంగల ర్యాపిడ్‌ గ్రావిటీ ఫిల్టర్‌ ప్లాంట్‌ పనులు చేపట్టారు.

కార్మిక కుటుంబాలకు కలుషిత నీరే దిక్కు

పూర్తికాని ర్యాపిడ్‌ గ్రావిటీ ఫిల్టర్‌ ప్లాంట్‌

రూ.25 కోట్లతో ఏడాది క్రితం పనులు

గడువు ముగిసినా ఇంకా అసంపూర్తిగానే నిర్మాణం

ఈ నెలాఖరు వరకు గడువు పొడిగింపు

గడువులోగా పూర్తిచేస్తాం

ర్యాపిడ్‌ గ్రావిటీ ఫిల్టర్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తాం. వాస్తవానికి గత ఆగస్టులోనే పనులు పూర్తికావాల్సి ఉంది. వర్షాలతో పనుల్లో ఆటంకం ఏర్పడింది. ఈనెలాఖరు వరకు ప్లాంట్‌ను ప్రారంభించి కార్మికులు, కార్మికేతర కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం.

– లలిత్‌కుమార్‌, ఆర్జీ–1 జీఎం

దాహం తీరేదెలా?1
1/2

దాహం తీరేదెలా?

దాహం తీరేదెలా?2
2/2

దాహం తీరేదెలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement