రికార్డులు.. అవార్డులు
జ్యోతినగర్(రామగుండం): భారతావనికి వెలుగులు పంచుతున్న రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్ట్ శుక్రవారంతో 48వ వసంతంలోకి అడుగిడుతోంది. రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌లో 2,600, తెలంగాణ స్టేజీ–1లో 1,600, ఫ్లోటింగ్ సోలార్ యూనిట్‌లో 100, గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్రాజెక్టులో 10.. ఇలా మొత్తంగా 4,310 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఐఎస్‌వో–14001 సర్టిఫికెట్ పొంది ‘సూపర్ థర్మల్ పవర్ స్టేషన్’గా రూపాంతరం చెందింది. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ 14 నవంబర్ 1978న రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్‌కు పునాది రాయి వేశారు.
పర్యావరణ పరిరక్షణకు..
విద్యుత్ ఉత్పత్తితోపాటు పర్యావరణ పరిరక్షణలోనూ ఎన్టీపీసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. 2019–20లో జిల్లాలో 90,000కుపైగా మొక్కలు నాటించింది. 53 రకాల మొక్కలతో మియావాకి విధానం ద్వారా నాలుగు స్టేజీల్లో 30,262 మొక్క లు నాటించి జిల్లాకే ఆదర్శంగా నిలిచింది.
బూడిద వినియోగంలోనూ..
విద్యుత్ తయారీ సందర్భంగా విడుదలయ్యే వ్యర్థ బూడిదను ఎన్టీపీసీ సెనోస్పియర్ సేకరణ, విక్రయాలు చేయడం ప్రారంభించింది. ఇటీవల నిర్మించిన సిమెంట్ ఫ్రీ ఫ్లై యాష్ బేస్డ్ జియోపాలిమర్ రోడ్డును అతితక్కువ కర్బన ఉద్గారం, తక్కువ నీటి వినియోగంతో చేపట్టింది. ఈ ప్రాజెక్టు బూడిద వినియోగం వైపు కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
నీటి సంరక్షణలోనూ అగ్రగామి..
ప్రవహించే నీటిని రీసైకిల్ చేయడంతోపాటు యాష్ హ్యాండ్లింగ్ కోసం వినియోగించే నీటిని రీసైకిల్ చేస్తూ హార్టికల్చర్ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారు. ఇటీవల జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రాజెక్టు ఏర్పాటు కాగా.. రిమోట్ ఉపయోగించి వైర్‌లెస్ వాటర్ వినియోగ డేటా పర్యవేక్షిస్తూ మొదటి ప్లాంట్‌గా రికార్డు కెక్కింది. అంతేకాదు.. ఉ ద్యోగుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. సామాజిక సేవా బాధ్యతగా సీఎస్సార్ ని ధులతో ఎన్టీపీసీ ప్రభావిత, సమీప ప్రాంతాల అభివృద్ధి, ప్రజాసంక్షేమానికి పాటుపడుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుతోంది,
సోలార్ పవర్ ఉత్పత్తిలోకి..
రామగుండం ఎన్టీపీసీ 13 డిసెంబర్ 2013న గ్రౌండ్ మౌంటెడ్ పద్ధతిన పది మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ పీవీ ప్లాంట్ ప్రారంభించింది. మనదేశంలోనే 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పీవీ ప్రాజెక్ట్ (మనదేశంలోనే అతిపెద్దది)ను తన రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసి రికార్డుకెక్కింది.
పర్యావరణ అనుమతి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు తొలుత స్టేజీ–1లో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు నిర్మించింది. ఇందులోంచి 85 శాతం విద్యుత్‌ను తెలంగాణకు అందస్తోంది. స్టేజీ–2లో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు యూనిట్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఇటీవల పర్యావరణ అనుమతులు ల భించాయి. వీటికితోడు విద్యుత్ ఉత్పత్తిలో ఐదు ప్ర తిష్టాత్మక టస్కర్ జాతీయ అవార్డులు అందుకుంది. హిందీ భాషను ప్రోత్సహించడంలో 2023–24 (రా జ్‌భాషా వర్గం) స్వర్ణశక్తి అవార్డు లభించింది. సీఐఐ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్లాంట్ అవార్డు –2025 అందుకుని ముందుకు సాగుతోంది.
విద్యుత్ ఉత్పత్తిలో ఎన్టీపీసీ అగ్రస్థానం సామాజిక సేవ, ఉద్యోగుల సంక్షేమంపైనా దృష్టి
రేపు 48వ వసంతంలోకి అడుగిడనున్న రామగుండం విద్యుత్ ప్రాజెక్ట్


