రైతులకు జవాబుదారీగా ఉండాలి
మంథని: ధాన్యం కొనుగోళ్లలో అందరూ రైతులకు జవాబుదారీగా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి బుధవారం శ్రీకారం చుట్టారు. పోచమ్మవాడ అంగుళూరు శివారులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మరిన్నిసౌకర్యాలు కల్పిస్తామన్నారు. నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. డ్రీమ్ స్టార్ట్ కార్యాలయంలో టీవర్క్స్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు ఆధునిక సాంకేతిక మైండ్‌సెట్ మేకర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించినట్లు పిల్లలు మంచికలలు కని, వాటిని సాకారం చేసుకోవాలని మంత్రి సూచించారు. మంథని యువకులు తయారు చేసిన వ్యవసాయ పవర్ ఫీడర్, ఆధునిక హెల్మెట్ ఆవిష్కరణ అభినందనీయమన్నారు. అంతకుముందు మంథని జూనియర్ కళాశాలలలో రూ.44 లక్షలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును మంత్రి ప్రారంభించారు. ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, టీజీఈఆర్సీ సలహాదారు శశిభూషణ్ కాచే, సింగిల్‌విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనిల్ కుమార్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బేగంపేటలో కొనుగోళ్లు ప్రారంభం..
రామగిరి(మంథని): బేగంపేట గ్రామంలో మంత్రి శ్రీధర్‌బాబు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. పలువురు అధికారులతోపాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, నాయకులు రోడ్డ బాపన్న, వైనాల రాజు, మద్దెల రాజయ్య, సిద్దం మురళీకృష్ణ, ప్రవీణ్, ఆరెల్లి శ్రీనివాస్, దాసరి శివ, ఆరెల్లి కొంరయ్య, తోట చంద్రయ్య, అవినాష్, పద్మ, శంకర్ పాల్గొన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు


