కూలి కూడా రావడం లేదు
వ్యాపారులకు అమ్మితే.. పత్తి ఏరిన కూలీలకు కూలి చెల్లించే ధర కూడా రావడంలేదు. మా ఊరు నుంచి ఆటోట్రాలీలో పత్తి తీసుకొని వచ్చిన. మద్దతు ధర లేదు. ఇంటికి తీసుకెళ్లలేక ఎంతోకొంతకు అమ్ముకోవాల్సి వచ్చింది. క్వింటాల్‌కు 4,500 ధర పెట్టిండ్రు.
– సీహెచ్ రాజేందర్, రైతు,
హరిపురం, ముత్తారం
ఏజెంట్లే ధర నిర్ణయిస్తున్నరు
నాణ్యత చూడకుండానే ఏజెంట్లు ధర నిర్ణయిస్తున్నరు. నా పత్తి క్వింటాల్‌కు రూ.5,937 ధర పెట్టిండ్రు. ఈ నామ్ పద్ధతి అంటే ఇదేనా? ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంటే.. దళారీలు ధర పలుకకుండ చేస్తున్నరు. అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నరు. ఎలక్ట్రానిక్ కాంటాల్లో సెట్టింగ్ చేసి మోసగిస్తున్నరు.
– చిలుకల సతీశ్, రైతు, చందపల్లె
కూలి కూడా రావడం లేదు


