ఉద్యోగుల సమగ్రాభివృద్ధి లక్ష్యం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ద్యోగుల శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధి లక్ష్యమని ఎన్టీపీసీ రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ టీటీఎస్‌లో మంగళవారం ఒత్తిడి నిర్వహణ, సానుకూల ఆలోచనలపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. జీవితంలోని అన్నిఅంశాలలో సమతుల్యతను కా పాడుకోవాలన్నారు. అనంతరం బ్రహ్మకుమారీస్ విశ్వని సూచించారు. విద్యాలయ అధ్యాపకులు బీకే ఉమారాణి, రజని, శోభ.. అంతర్గత శాంతిని సాధించడం, భావోద్వేగ సమతుల్యత ను కాపాడుకోవడం, వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించడంపై వివరించారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నేడు మంత్రి పర్యటన
మంథని: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవా రం జిల్లాలో పర్యటించనున్నారు. రామగిరి మండలం బేగంపేట గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభిస్తారు. 17 పాఠశాలల్లో రూ.3.43 కోట్లతో టేపట్టిన అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేస్తా రు. మంథని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో రూ.44 లక్షలు వెచ్చించి నిర్మించిన సింథటిక్ షటిల్ కోర్టును మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభిస్తారు. పోచమ్మవాడలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తారు. అడవి సోమనపల్లిలో 40 ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశం చేయిస్తారు. విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంటలో క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు అందజేశారు.
వారసత్వ హక్కును కొనసాగించాలి
పెద్దపల్లి: మున్సిపల్ కార్మికులకు వారసత్వహక్కును కొనసాగాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు కోరారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మున్సిపల్ యూని యన్ సమావేశం మహంకాళి సురేశ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఆయన మా ట్లా డుతూ, మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వారసత్వహక్కును నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్య క్రమంలో నాయకులు సావనపల్లి వెంకటస్వామి, బొంకూరి సాగర్, మద్దెల రాజయ్య, బొంకురి శంకర్, చింతల మరియా, ఆరేపల్లి ప్రమీల, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆలయ భూములపై విచారణ
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: పట్టణ శివారులో ఆక్రమణకు గురైన ఆలయ భూములపై లోకాయుక్త ప్రతినిధి నరసింహతోపాటు దేవాదా య, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ రాజ య్య మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జాపతి రాజేశ్ పటేల్ వారిని కలిశారు. అన్యాక్రాంతమైన దేవాలయాల భూము లను పరిరక్షించాలని ఆయన విన్నవించారు. ఈయన ఫిర్యాదుపైనే అధికారులు మోకాపై భూములు పరిశీలించారు. వారివెంట ఆర్‌ఐ సత్యనారాయణ, ఈవో శంకరయ్య, రాజ్‌కుమార్, సర్వేయర్లు తదితరులు ఉన్నారు.
రేపు ధర్మారంలో సదస్సు
ధర్మారం(ధర్మపురి): లీడ్ ఇండియా ఫౌండేష న్, విశ్వగురు భారత్ –2047 ఆధ్వర్యంలో ట్రె యినింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ కోసం ఈనెల 13 న స్థానిక సెర్ప్ కార్యాలయంలో అవగాహన స దస్సు నిర్వహించనున్నట్లు లీడ్ ఇండియా శి క్షణ సమనవ్యయకర్త తాడూరి శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారికి హైదరాబాద్‌లో మూ డు రోజుల శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణలో ఎంపికై న వారికి ఉచిత వసతితోపాటు భోజనం, గౌర వవేతనం చెల్లిస్తారన్నారు. నైపుణ్యం ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, ఆసక్తి గలవారు అవగాహన సదస్సుకు హాజరుకావాలని ఆయన కోరారు.
ఉద్యోగుల సమగ్రాభివృద్ధి లక్ష్యం
ఉద్యోగుల సమగ్రాభివృద్ధి లక్ష్యం


