గోదావరిఖనిలో పోలీసుల తనిఖీలు
పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో..
గోదావరిఖని: ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో జిల్లా పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. రామగుండం, పెద్దపల్లి రైల్వేస్టేషన్లు, సుల్తానాబాద్, మంథని, పెద్దపల్లి, గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం తనిఖీలు విస్తృతం చేశారు. రద్దీ ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్స్, జాగిలాలతో సోదాలు చేశారు. గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, ప్రధాన చౌరస్తా, ల క్ష్మీనగర్, ఓల్డ్‌అశోక్ థియేటర్ ఏరియాతోపాటు న గరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు బలగాలు అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అనుమానితులను ప్రశ్నించి వదిలేశాయి. ఎస్సైలు రమేశ్, భూమేశ్, అనూషతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్లలో..
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ తదితర రద్దీ ప్రదేశాల్లో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. బాంబు పేలుళ్లను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్తగా తనిఖీలు చేశామని డీసీపీ, ఏసీపీలు తెలిపారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సోదాలు..
రామగుండం: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీస్ భద్రతా బలగాలు స్థానిక రైల్వేస్టేషన్‌లో ముమ్మర సోదాలు చేశాయి. రైళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశాయి. అనుమానితులను ప్రశ్నించి వదిలేశాయి. కార్యక్రమాల్లో ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఎస్సై క్రాంతి కుమార్, ఏఎస్సైలు రామకృష్ణ, నాగరాజు, జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
రంగంలోకి పోలీస్ జాగిలాలు
రంగంలోకి పోలీస్ జాగిలాలు


