శిక్షణతో యువతకు ఉపాధి
పెద్దపల్లి: గ్రామీణ నిరుద్యోగ యువత ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. రంగంపల్లిలో గ్రామీణ స్వ యం ఉపాధి శిక్షణ సంస్థ(రీసెట్ ) శిబిరాన్ని మంగళవారం అయన ప్రారంభించి మాట్లాడారు. టైలరింగ్, మగ్గం వర్క్‌లో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ అపర్ణరెడ్డి, రీసెట్ డైరెక్టర్ రాకేశ్, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే పేదరికం అంతం
విద్యతోనే పేదరికం అంతమవుతుందని కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్నారు. గత విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. జిల్లా మైనార్టీ అధికారి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచాలి
ప్రతీ విద్యార్థికి సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచేందుకు కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించా రు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్‌వాలా అమలుపై కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, టీఆర్‌ఐఈఎస్ హెడ్‌మాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లా డారు. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా విద్యార్థుల 100 శాతం హాజరు నమోదు చేయాలని అన్నారు. జేఈఈ, నీట్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఫిజిక్స్‌వాలా యాప్ అమలు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
చివరిగింజ వరకూ కొనుగోలుకు చర్యలు
ధాన్యం చివరిగింజ వరకూ కొనుగోలు చేస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోలు చేసేందుకు 333 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, మంగళవారం వరకు 1,140 మంది రైతుల నుంచి రూ.18 కోట్ల 85 లక్షల విలువైన 7,890 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేిశామాని, 7,461 మెట్రిక్ టన్నులను రైస్ మిల్లులకు తరలించి, 470 మంది రైతులకు 3,073 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.7 కోట్ల 34 లక్షలు చెల్లించామని కలెక్టర్ వివరించారు.


