మారనున్న సుల్తానాబాద్ రూపురేఖలు
పెద్దపల్లి: సుల్తానాబాద్ రూపురేఖలు మారుతున్నా యి. మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపల్ గా ఆవిర్భవించినా మొన్నటిదాకా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఇటీవల రూ.15కోట్లు ప్రభు త్వం మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు ప ట్టాలెక్కాయి. ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించగా పట్టణం సరికొత్తకళ సంతరించుకుంది. తాజా గా కాల్వశ్రీరాంపూర్ చౌరస్తా నుంచి రిక్రియేషన్ క్ల బ్ వరకు ఇరుకై న రోడ్డు విస్తరణకు సమీపంలోని వాణిజ్య, వాపార సంస్థల షట్టర్లు తొలగిస్తున్నారు. ఆ వెనకాలే నిర్మించిన కొత్త దుకాణాలను నష్టపోయిన వ్యాపారులకు ఉచితంగా కేటాయించారు.
అందుబాటులోకి నీరుకుల్ల మానేరు వంతెన
కరీంనగర్, వరంగల్, హన్మకొండ తదితర దూర ప్రాంతాలు, జమ్మికుంట ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మధ్య రాకపోకలు సాగించేందుకు నీరుకుల్ల మానేరుపై వంతెన అందుబాటులోకి వచ్చింది. దీనిద్వా రా ఆయా ప్రాంతాలకు దూరభారం తగ్గుతుంది.
విలీన గ్రామాలపై దృష్టి
సుగ్ల్లాంపల్లి, పూసాల, శాసీ్త్రనగర్‌ను సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఇటీవల విలీనం చేశారు. ఆ గ్రా మాల్లో ఇప్పటికీ మౌలిక వసతులు లేవు. విలీన గ్రామాల అభివృద్ధికి రూ.4 కోట్లతోపాటు అంతర్గత రహదారులకు రూ.6 కోట్లు, డ్రైనేజీలకు రూ.3 కోట్లు, కల్వర్లకు రూ.కోటి, జంక్షన్ల కోసం మరో రూ.కోటి మంజూరయ్యాయి.


