ప్రతిభను వెలికి తీయాలి
● అదనపు కలెక్టర్ వేణు ● ఘనంగా యువజనోత్సవాలు
పెద్దపల్లి: యువత తమ ప్రతిభను వెలికి తీయాలని అదనపు కలెక్టర్ వేణు సూచించారు. జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం జాతీయ యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. యువత అన్నిరంగాల్లో రాణించాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రో త్సహిస్తుందన్నారు. అనంతరం పలు రంగాల్లో ప్ర తిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చే శారు. జిల్లా యువజన, క్రీడల అధికారి సురేశ్, ఉ పాధి కల్పనాధికారి రాజశేఖర్, ఇంటర్ విద్య నోడ ల్ ఆఫీసర్ కల్పన, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి, ప్రతినిధులు ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్, దుర్గాప్రసాద్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆటల్లోనూ రాణించాలి
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని అదనపు కలెక్టర్ వేణు కోరారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ మహాత్మాజ్యోతిబా పూలే గురుకులంలో అండర్– 14,– 19 జిల్లాస్థాయి క్రీడా పో టీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ప్రతినిధులు మణిదీప్తి, శ్రీనివా స్, సురేశ్‌కుమార్, సంధ్యారాణి పాల్గొన్నారు.


