సర్క్యులర్ ఎత్తివేయాలి
కార్మికుల ఆత్మగౌవరం దెబ్బతినేలా సర్క్యులర్ జారీచేయడం సరికాదు. ఈ విషయంలో గని లెవల్‌లో అధికారులకు అవగాహన లేకుండాపోయింది. ఏడా దిలో 220 మస్టర్లు ఉన్న కార్మికులను కూడా ఈనెలలో మస్టర్లు తక్కువ ఉన్నాయని కౌన్సెలింగ్‌కు పిలిచారు. దీంతో వారి మనోస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంది.
– మిర్యాల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు, టీబీజీకేఎస్
కార్మికుల సంఖ్య తగ్గించేందుకే..
కార్మికులను ఇంటికి పంపించేందుకే గైర్హాజర్ విధానం ప్రవేశపెట్టారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఈ పద్ధతిని ఉపసంహరించుకోవాలి. ఏదో ఒకనెలలో కనీస మస్టర్లు నిండకపోయినా కౌన్సెలింగ్ ఇవ్వడం సరికాదు. యువ కార్మికుల మనోభావాలు దెబ్బతింటాయి. పాత పద్ధతి కొనసాగించాలి.
– తుమ్మల రాజారెడ్డి, అధ్యక్షుడు, సీఐటీయూ
వ్యతిరేకిస్తున్నాం
యాజమాన్యం ఏకపక్షంగా ప్రవేశపెట్టిన గైర్హాజర్ సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తున్నాం. ప్రతీనెల కౌన్సెలింగ్ పేరిట కార్మికులను ఇబ్బంది పెట్టే విధానం సరికాదు. ఈనెల 10న జరిగిన స్ట్రక్చర్‌సమావేశంలో ఈవిషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాం. కార్మికుల పోరులో ఈఅంశం కూడా ఉంది. – కొరివి రాజ్‌కుమార్,
ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ
సర్క్యులర్ ఎత్తివేయాలి
సర్క్యులర్ ఎత్తివేయాలి


