దేశభక్తికి శాశ్వత చిహ్నం వందేమాతరం
● రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
గోదావరిఖని: వందేమాతరం గీతం దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కమిషరేట్‌లో శుక్రవారం సామూహిక గేయాలాపన చేశారు. భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలం, జాతీయ గుర్తింపు భావన, వలసపాలనపై ప్రతిఘటన పెరుగుతున్న దశలో వందేమాతరం మాతృభూమిని బలంగా తాకిందని ఆయన గుర్తుచేశారు. జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని ఆయన అన్నారు. కార్యక్రమములో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐలు వామనమూర్తి, మల్లేశం, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సందీప్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉత్పత్తిలో ఎన్టీపీసీ అగ్రగామి
జ్యోతినగర్(రామగుండం): దేశ అవసరాల్లో 24 శాతం విద్యుత్ ఉత్ప త్తి చేస్తూ ఎన్టీపీసీ అ గ్రస్థానంలో నిలుస్తోంద ని ఆ సంస్థ తెలంగాణ – రామగుండం ప్రాజెక్టు ఎ గ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద న్ కుమార్ సామంత అ న్నారు. సంస్థ ఆవిర్భా వం సందర్భంగా పర్మినెంట్ టౌన్‌షిప్‌లో శుక్రవారం సామూహికంగా మొ క్కలు నాటారు. అనంతరం ఎన్టీపీసీలోని కాకతీయ ఆడిటోరియంలో ఆవిర్భా వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడీ సామంత మా ట్లాడుతూ, మనదేశాన్ని శక్తిమంతం చేయడంలో ఎన్టీపీసీ 50 ఏళ్లుగా అద్భుతమైన ప్రయాణం సాగిస్తోందన్నారు. అనంతరం రైజింగ్ డే కేక్ కట్ చేశారు. బెలూన్ విడుదల చేశారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. నోయిడా ఎన్టీపీసీ నుంచి సీఎండీ గురుదీప్‌సింగ్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో తిలకించారు. వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో
ఎన్టీపీసీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగులు స్థానిక పర్మినెంట్‌టౌన్‌షిప్‌లో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆకుల రాంకిషన్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ప్రతినిధులు దుర్గం నర్సయ్య, పోచయ్య, లాలయ్య, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నేడు తాగునీటి సరఫరా బంద్
పెద్దపల్లి: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, అంతర్గాం మండలంలోని 4 ఆవాసాల్లో ఈనెల 8న తాగునీటి సరఫరా నిలిపివేస్తామని మిషన్ భగీరథ ఈఈ గ్రిడ్ పూర్ణచందర్ తెలిపారు. అంతర్గాంలోని ముర్మూరు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద సంపు పైప్‌లైన్ నిర్వహణ పనులు చేపట్టామని, దీంతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, అంతర్గాం మండలంలో కొంత భాగానికి శనివారం తాగునీటి సరఫరా నిలిచిపోతుందని ఆయన వివరించారు. ప్రజలు తమతో సహకరించాలని ఆయన కోరారు.
దేశభక్తికి శాశ్వత చిహ్నం వందేమాతరం


