జీజీహెచ్‌లో సేవలు భేష్
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలు భేషుగ్గా అందిస్తున్నారని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. అక్టోబర్‌లో 240 ప్రసవాలు చేయడం అభినందనీయన్నారు. సూపరింటెండెంట్ దయాళ్‌సింగ్‌తోపాటు సిబ్బందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎంహెచ్‌వో వాణిశ్రీ, సిమ్స్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ నరేందర్, డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్‌ఎంవో రాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాల పెంపునకు కృషి
పెద్దపల్లి: ఏఐ ల్యాబ్ ద్వారా కనీస విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఏఎక్స్‌ఎల్ పాఠశాలల పురోగతిపై అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. అదనంగా కంప్యూటర్లు ఏర్పాటు చేయాల ని, ప్రతీ విద్యార్థి రోజూ కనీసం అర్ధగంట సమయం గడిపేలా చూడాలన్నారు. కోర్టు కేసులపై జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, కోర్టు కేసుల ట్రాకింగ్‌కు ప్రత్యేక వ్య వస్థ ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ జిల్లా అధికారి పేరిట లాగిన్‌తో సోమవారం నుంచి కోర్టు కేసులు ట్రాక్ చేసే వ్యవస్థ పని చేయాలని ఆదేశించారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
వందేమాతరం ఆలాపన
వందేమాతరం గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కలెక్టరేట్‌లో సామూహిక వందేమాతరం గీతాలాపన చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతోపాటు అదనపు కలెక్టర్ వేణు, కలెక్టరేట్ పాలనాధికారి శ్రీనివాస్, సీ సెక్షన్ పర్యవేక్షకుడు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


