రోడ్లపైనే ధాన్యం
పెద్దపల్లిరూరల్: మద్దతు ధరతోనే విక్రయించాలనే ఆరాటంతో రైతులు మెయిన్‌రోడ్లపైనే వడ్లు ఆరబోస్తున్నారు. నిత్యం రాకపోకలు సా గించే రోడ్లపై ధాన్యం కుప్పలను గమనించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతు న్నారు. రెండురోజుల క్రితం కనగర్తి శివారు లో ఓ వ్యాన్ ధాన్యం కుప్పపైకి దూసుకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. అదృష్టవశాత్తు ఎలాంటి నష్టం జరక్కపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. రోడ్లపై ధా న్యం ఆరబోస్తే ఎర్రజెండాలు, రేడియం స్టిక్క ర్లు ఉంచాలని పలువురు సూచిస్తున్నారు.
పోటాపోటీగా క్రీడా పోటీలు
సుల్తానాబాద్‌రూరల్: భూపతిపూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయంలో ఉ మ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి గేమ్స్, స్పోర్ట్స్ మీట్ –2025తో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నా రు. శుక్రవారం అండర్–17లో వాలీబాల్, క బడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. శనివా రం చెస్, రన్నింగ్, లాంగ్ జంప్, షాట్‌ఫుట్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీని వాస్ తెలిపారు. ఏటీపీ సురేశ్‌కుమార్, డీడ బ్ల్యూ సంధ్యరాణి, ఉపాధ్యాయులు ఉన్నారు.
10న అప్రెంటిషిప్ మేళా
రామగుండం: స్థానిక ఐటీఐలో ఈనెల 10న అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రి న్సిపాల్ సురేందర్, ట్రైనింగ్ ఆఫీసర్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. పలు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఆసక్తిగల వారు www.apprenticeshipindia.gov.in వె బ్‌సైట్‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, హా ర్డ్‌కాపీలు, ఎస్సెస్సీ మెమో, ఐటీఐ ఉత్తీర్ణత స ర్టిఫికెట్, టీసీ, ఆధార్‌కార్డు తదితర ధ్రువీకరణపత్రాలతో హాజరుకావాలని కోరారు.
రోడ్లపైనే ధాన్యం


