రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలి
పెద్దపల్లి: క్రీడా పోటీల్లో రాణించి రాష్ట్రానికి మంచిపేరు తీసురావాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం తెలంగాణ సీనియర్ రాష్ట్ర ఖోఖో పోటీలు క లెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు ప్రత్యేక ప్రా ధాన్యం ఇస్తున్నాయన్నారు. జిల్లా క్రీడాకారులనూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.చి అండగా నిలుస్తున్నామని అన్నారు. ప్రతీఒక్కరు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నారు. గెలుపోవటము లను సమానంగా తీసుకోవాలని సూచించారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసంతోపాటు స్నేహభావం పెంపొందుతుందని వివరించారు. పోటీల్లో 13 పురుషుల, 12 మహిళా జట్లు పాల్గొన్నాయి. ఆ ర్డీవో గంగయ్య, టీఎన్జీవో అధ్యక్షుడు బొంకూరి శంకర్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సురేశ్, ప్రతినిధులు కృష్ణమూర్తి, మహేందర్‌రావు, ముస్త్యా ల రవీందర్, కిష్టయ్య, లక్ష్మణ్, సురేందర్, లక్ష్మ య్య, కుమారస్వామి, గెల్లు మధుకర్ పాల్గొన్నారు.


