పిచ్చుకల సవ్వడి.. కానరాదాయె..
ఒకప్పుడు గ్రామాల్లో పిచ్చుకల కిలకిల రాగాలు పల్లెవాసులను
నిద్రలేపేవి. ఇంట్లో కుటుంబసభ్యుల్లా మనతోపాటే కలియతిరిగేవి. మారుతున్న సాంకేతికత పక్షుల మనుగడపై ప్రభావం చూపుతోందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అవి అంతరించిపోతే... ఫొటోలు, లేదా అప్పుడప్పుడు ఎక్కడోఓచోట కనిపిస్తే.. పిచ్చుకలు ఇలా ఉంటాయని మనపిల్లలకు పరిచయడం చేసే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని పక్షిప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివారులో విద్యుత్ తీగలపై పక్షుల సమూహం ‘సాక్షి’ కెమెరాకు ఇలా అందంగా కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


