ఎగ్లాస్‌పూర్ కారోబార్ హఠాన్మరణం
రామగుండం: అంతర్గాం మండలం ఎగ్లాస్‌పూర్ కారోబార్ తూడూరి శ్రీనివాస్‌గౌడ్ శుక్ర వారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గ్రామపంచాతీయ కార్యాలయంల్లో విధుల్లో ఉండగా మధ్యాహ్నం 12గంటలకు గుండెనొప్పి వచ్చింది. దీంతో ఇంట్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య అంజలి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎగ్లాస్‌పూర్ కారోబార్‌గా సుమారు ఇరవైఏళ్లపాటు ఆయన సేవలు అందించారు. ఎంపీడీవో సుమలత, ఎంపీవో వేణుమాధవ్, సూపరిండెంటెండ్ కరుణాకర్ తదితరులు సంతాపం ప్రకటించారు.


