రేడియాలజీ కీలకం
వ్యాధి
నిర్ధారణలో
కోల్‌సిటీ(రామగుండం): గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్, కేన్సర్, కడుపునొప్పి, మెదడులో కణితి.. ఇలా వ్యాధి ఏదైనా నిర్ధారించేది రేడియాలజిస్టులే. గర్భంలోని శిశువు ఆరోగ్యం నుంచి వృద్ధాప్య సంబంధిత వ్యాధుల వరకూ వారిదే కీలకపాత్ర. పాతకాలపు ఎక్స్‌రే నుంచి నేటిడిజిటల్ ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్.. ఇలా అనేక ఇమేజింగ్ పరికరాలు వైద్యరంగంలో పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా సూక్ష్మదశలోని వ్యాధులను కూడా గుర్తించగలుగుతున్నారు. గుండె, మెదడు, కిడ్నీల పనితీరు తెలుసు కోవడం, రక్తప్రసరణ జరిగే రక్తనాళాల్లో పూడికలను గుర్తించడం అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో వందలాది మంది రేడియాలజిస్టులు సేవలు అందిస్తున్నారు. నేడు ప్రపంచ రేడియోగ్రాఫీ డే సందర్భంగా కథనం..
నేపథ్యమిది...
జర్మన్ శాస్త్రవేత్త విలియం కనార్డ్ రాంటిజన్ 1895లో ఎక్స్‌కిరణాలు కొనుగొన్నాడు. ఇది వైద్య ప్రపంచానికి వెలుగురేఖగా మారింది. నూతన ఆవిష్కరణలు, రేడియాలజిస్టుల పాత్రపై చర్చించుకోవడంతోపాటు, ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఏటా నవంబర్ 8న ప్రపంచ రేడియోగ్రఫీ డేగా నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్‌ను ‘రేడియోగ్రాఫర్లు: కనిపించని వాటిని చూసేవారు..’ అని ప్రకటించారు.
సూక్ష్మదశలో వ్యాధుల గుర్తింపు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైబ్రీడ్ ఇమేజింగ్ ఏకీకరణతో రేడియాలజీ పురోగతి సాధించింది. వ్యాధి నిర్ధారణ, చికిత్స సామర్థ్యాలు పెంచుతోంది.
● ఏఐ అప్లికేషన్లు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, ఊపిరితిత్తుల నోడ్యూల్ డిటెక్షన్, వర్క్ ఫ్లో క్రమబద్ధీకరించడం కోసం ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కేన్సర్, గుండెరక్తనాళాలతోపాటు అనేక కీలక వ్యాధులను గుర్తిస్తున్నారు.
సింగరేణిలోనే ఆధునిక స్కానర్లు..
● సింగరేణి సంస్థ అత్యాధునిక 128 స్లైస్ సామ ర్థ్యం కలిగిన రెండు సీటీ స్కానింగ్ యంత్రాలు కొనుగోలు చేయనుందని సీఎంవో కిరణ్‌రాజ్‌కుమార్ ఇటీవల ప్రకటించారు. ఒకటి రామగుండం, మరోటి కొత్తగూడెంలోని ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తారు. ఇవి మల్టీ డిటెక్టర్లు. శరీరంలోని అంతర్గత నిర్మాణాన్ని త్రీడీ రూపంలో ఒకేసారి 128 చిత్రాలను చూపించే నైపుణ్యం కలిగి ఉంటుందని నిపుణులు వివరించారు.
నైతిక ప్రమాణాలకు ఎన్‌సీఏహెచ్‌పీ యాక్ట్..
● జాతీయ అనుబంధ, ఆరోగ్య వృత్తుల కమిషన్ (ఎన్‌సీఏహెచ్‌పీ)ను ఇటీవల కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ప్రతీరాష్ట్రంలో స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం, కోర్సుల ప్రమాణాలు, సిలబస్, నైపుణ్య ప్రమాణాలు నిర్ణయించడం, వృత్తి నైపుణ్యం, నైతిక విలువలు కాపాడటానికి ఇది దోహపడుతోంది. దీని ద్వారా రేడియోగ్రాఫర్లకు గుర్తింపుతోపాటు నైతిక ప్రమాణాలు, వృత్తి భద్రత లభిస్తుందని వారు వెల్లడిస్తున్నారు. తద్వారా వ్యాధి నియంత్రణకు చికి త్స సులభతరం అవుతుందని చెబుతున్నారు.
ఏఐ రాకతో విప్లవాత్మక మార్పులు
నేడు ప్రపంచ రేడియోగ్రఫీ డే
30 ఏళ్లుగా సేవలు
భద్రతా ప్రమాణాలతో 30 ఏళ్లుగా రేడియాలజీలో సేవలు అందిస్తున్నా. ప్రస్తుతం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్నా. కరీంనగర్ జిల్లాలోనే తొలి సీటీస్నానింగ్ సెంటర్ టెక్నీషియన్‌గా పేరుతెచ్చుకున్నా. హైదరాబాద్ అపోలో హాస్పటల్‌లో కేన్సర్ నిర్ధారణ కోసం ఉపయోగపడే పెట్‌సీటీస్కాన్ ఏర్పాటు చేయగా, ఇండియాలోనే తొలిసారి దీనిపై పనిచేసిన రేడియాలజిస్ట్‌గా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. రేడియేషన్‌పై ప్రజలకు అవగావహన కల్పిస్తూనే, భద్రతా ప్రమాణాలతో సేవలందిస్తున్నాం.
– సుంకరి యాదవరెడ్డి, ఉపాధ్యక్షుడు, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్
రేడియాలజీ కీలకం


