రాయ‘బేరాలు’ | - | Sakshi
Sakshi News home page

రాయ‘బేరాలు’

Nov 8 2025 7:06 AM | Updated on Nov 8 2025 7:06 AM

రాయ‘బేరాలు’

రాయ‘బేరాలు’

రూ.కోట్లు పలుకుతున్న గుడ్‌విల్‌ జాక్‌పాట్‌

అదృష్టవంతులకు ఎర

చక్రం తిప్పుతున్న లిక్కర్‌ వ్యాపారులు

ముస్తాబాద్‌(సిరిసిల్ల): కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ, లక్కీడ్రా ప్రక్రియ అక్టోబర్‌లో ముగిసింది. లక్కీ డ్రాలో కొత్తవారికే ఎక్కువ మద్యం దుకాణాలు రావడంతో, ఇప్పటికే ఈరంగంలో ఉన్న వ్యాపారులు నిరాశకు గురయ్యారు. పదుల సంఖ్యలో దరఖాస్తులు వేస్తే సరైన దుకాణాలు రాలేదని పేర్కొన్నారు. దీంతో డిమాండ్‌ ఉన్న దుకాణాలను దక్కించుకునేందుకు రాయబేరాలు మొదలు పెట్టారు. గుడ్‌విల్‌ రూ.కోటి వరకు ఇచ్చి వైన్స్‌ను తీసుకోవాలన్న ఆలోచన వారిలో వచ్చింది. ఇప్పటికే వైన్స్‌ నడపడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉండడంతో నో ఫ్రాఫిట్‌, నో లాస్‌ విధానంతో మద్యం దుకాణాలు నడిపేందుకు ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు. కాగా, 99 దరఖాస్తులు వేసిన ఓ సిండికేట్‌కు నామమాత్రంగా రెండు దుకాణాలే రావడంతో, మరింత పెట్టుబడి పెట్టి వైన్స్‌ను తీసుకోవాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మద్యం దుకాణాలకు కోడింగ్‌ ద్వారా ఎంపిక చేసేవారు. పదేళ్లలో దరఖాస్తులు, లాటరీ పద్ధతిన దుకాణాలను కేటాయిస్తున్నారు.

ప్రభుత్వానికి పోటీగా ఆదాయం

లక్కీడ్రాలో దుకాణాలు వచ్చిన అదృష్టవంతులు జాక్‌పాట్‌ కొడుతున్నారు. గుడ్‌విల్‌ కింద రూ.60 లక్షల నుంచి రూ.కోటి ఇరవై లక్షల వరకు దుకాణాలకు చెల్లించడమే దీనికి కారణం. అలాగే కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చిన వారితోపాటు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమూహంగా ఏర్పడి దరఖాస్తులు చేసుకున్న వారే అధిక సంఖ్యలో లక్కీడ్రాలో దుకాణాలు దక్కించుకున్నట్లు భావిస్తున్నారు. పది నుంచి ఇరవై దుకాణాలు ఇలా ఇతరుల చేతిలోకి మారినట్లు తెలుస్తోంది. వారు గుడ్‌విల్‌గా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి గత మూడు పర్యాయాలు దుకాణాలకు దరఖాస్తులు చేసి, మూడు పర్యాయాలు లక్కీడ్రాలో విజేతగా నిలిచాడు. సదరు వ్యక్తి ఒక్కసారి కూడా వైన్స్‌ నిర్వహించలేదు. ఇతరులకే గుడ్‌విల్‌ కింద అప్పగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement