గృహిణి ఆత్మహత్యాయత్నం
ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వైనం సత్వరమే స్పందించిన పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలింపు 90శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాధితురాలు పరిస్థితి విషయం
గోదావరిఖని: స్థానిక సింగరేణి మెడికల్ కాలేజీ ఎదుటగల తుమ్మ పొదల్లో గృహిణి సల్ల స్వప్న(38) శుక్రవారం రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. పోతనకాలనీలో నివాసం ఉంటున్న ఓ ప్రైవేట్ కార్మికుడి భార్య స్వప్న.. ఇంట్లోనుంచి బయటకు వెళ్లిపోయింది. ఈమేరకు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదైంది. కాసేపటికే ఆత్మహత్యా యత్నం విషయం వెలుగుచూసింది. తుమ్మపొదల్లో మంటల్లో కాలిపోతున్న మహిళ విషయాన్ని కొందరు మెడికోలు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఇంద్రసేనారెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 90శాతం కాలిన గాయాలతో పడిఉన్న మహిళను సీఐతోపాటు పోలీసు సిబ్బంది ఆటోలో ఆస్పత్రికి తరలించారు. దాదాపు రెండు లీటర్ల పెట్రోల్‌ను బాధితురాలు ఒంటిపై పోసుకుందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. కాగా, తనకు కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగో ఉండడం లేదని సూసైడ్ నోట్‌సారి, ఒంటిపై ఉన్న బంగారం ఇంట్లో పెట్టి బయటకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


