నేటి నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
పెద్దపల్లి: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు జరుగనున్నాయి. గురువారం రాత్రి 10 మహిళ, 10 పురుషుల జట్లు రిపోర్ట్ చేసినట్లు పెటా జిల్లా అధ్యక్షుడు వేల్పుల సురేందర్ తెలిపారు. ఈనెల 7 నుంచి 9 వరకు క్రీడలు కొనసాగుతాయి. ముఖ్య అతిథులుగా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, డీసీపీ కరుణాకర్, డీవైఎస్‌వో సురేశ్ హాజరుకానున్నారు. రాష్ట్రస్థాయి పోటీలు ఉమ్మడి జిల్లాల మధ్య నిర్వహించనుండగా ఈసారి రెండు జట్లకు తెలంగాణ ఖోఖో సంఘం అవకాశం కల్పించింది. పెద్దపల్లి సీనియర్స్ పురుషులు, మహిళల జట్లు బరిలో దిగనున్నాయి. జిల్లా జట్టుకు ఎంపికై న మహిళ, పురుషుల జట్లకు ఇండియన్ మిషన్ స్కూల్‌లో శిక్షణను గురువారంతో ముగించారు.
దాదాపు 500 మందికి ఏర్పాట్లు
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు పెద్దపల్లి ఆతిథ్యం ఇస్తుండగా, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ మహబూబ్‌నగర్, ఖమ్మం తో పాటు నూతనంగా పెద్దపల్లి జట్లు, తెలంగాణ పోలీస్ శాఖ టీంకు అవకాశమిచ్చారు. 12 పురుష, 11 మహిళ జట్లు పోటీ పడనున్నాయి. 46 మంది కోచ్‌లు, మేనేజర్లు, 50 మంది టెక్నీషియన్స్, 300 మంది పురుషులు, మహిళలకు ఏర్పాట్లు చేశారు.
7 నుంచి 9 వరకు నిర్వహణ


