15న స్పెషల్‌ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

15న స్పెషల్‌ లోక్‌ అదాలత్‌

Nov 7 2025 6:47 AM | Updated on Nov 7 2025 6:47 AM

15న స

15న స్పెషల్‌ లోక్‌ అదాలత్‌

పెద్దపల్లి: సుల్తానాబాద్‌ కోర్టులో ఈనెల 15న స్పెషల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేశ్‌ తెలిపారు. గురువారం బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. మూడేళ్లలోపు శిక్ష పడే క్రిమినల్‌ కేసులు, కుటుంబ వివాదాలు, భూమి తగాదాలు, ప్రమాదాలు, చెక్‌ బౌన్స్‌ కేసులను స్పెషల్‌ లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో ఏజీపీ ఆంజనేయులు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, కార్యదర్శి బోయిని భూమయ్య, న్యాయవాదులు పాల్గొన్నారు.

గెలుపోటములను సమానంగా తీసుకోవాలి

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): గెలుపోటములను విద్యార్థులు సమానంగా తీసుకోవాలని సుల్తానాబాద్‌ సీఐ సుబ్బారెడ్డి, మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ అంజలి అన్నారు. సుల్తానాబాద్‌ మండలం భూపతిపూర్‌లోని జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్థాయి గేమ్స్‌, స్పోర్ట్స్‌ మీట్‌–2025 నిర్వహించారు. పోటీలను గురువారం సీఐ, ఆర్‌సీవోలు ప్రారంభించారు. అండర్‌–17 విభాగంలో వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఎస్సై–2 అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, ఏటీపీ సురేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

పెద్దపల్లి: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం విక్రయించాలని డీసీవో శ్రీమాల అన్నారు. గురువారం సుల్తానాబాద్‌ పట్టణంలోని సుగ్లాంపల్లిలో పీఎసీఎస్‌ ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మాయిశ్చర్‌ వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసి లారీల ద్వారా రైస్‌ మిల్లులకు పంపిణీ చేయాలన్నారు. అధికా రులు వెంకటేశ్వర్లు, బూరుగు సంతోష్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, నాయకులు గాజుల రాజమల్లు, దుగ్యాల సంతోష్‌రావు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు ఎన్టీపీసీలో రైజింగ్‌ డే వేడుకలు

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ 51వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా శుక్రవారం ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 6.30 గంటలకు పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లో మాస్‌ ట్రి ప్లాంటేషన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంత చేతుల మీదుగా 8.15 గంటలకు కాకతీయ ఆడిటోరియంలో పతాకావిష్కరణ, ఎన్టీపీసీ గీత్‌ ఆలాపన, కేక్‌ కటింగ్‌, విజిలెన్స్‌ వారోత్సవాల విజేతలకు బహుమతులు పంపిణీ చేస్తారు. అనంతరం ఢిల్లీ నుంచి వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్టీపీసీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గురుదీప్‌సింగ్‌ ఉపన్యాసం ప్రత్యక్షప్రసారం కార్యక్రమాలు ఉంటాయని అధికారవర్గాలు వెల్లడించాయి.

నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మార్కెట్‌యార్డుతో పాటు సీసీఐ కేంద్రాలు, జిన్నింగ్‌మిల్లుల్లో శుక్రవారం పత్తి కొనుగోళ్లు యథావిధిగా సాగుతాయని జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌ రెడ్డి తెలిపారు. సీసీఐ అమల్లోకి తెచ్చిన కఠిన నిబంధనలను కొంత మేర సడలించాలని కోరుతూ జిన్నింగ్‌ మిల్లర్ల అసోసియేషన్‌ కొనుగోళ్లకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కేంద్ర మంత్రి, సీసీఐ అధికారులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపుతామని అసోసియేషన్‌ నాయకులకు హామీ ఇవ్వడంతో కొనుగోళ్లకు ముందుకొచ్చారని పేర్కొన్నారు. రైతులు తమ పత్తి దిగుబడులను తెచ్చి యార్డులో విక్రయించుకోవచ్చని తెలిపారు.

15న స్పెషల్‌ లోక్‌ అదాలత్‌
1
1/2

15న స్పెషల్‌ లోక్‌ అదాలత్‌

15న స్పెషల్‌ లోక్‌ అదాలత్‌
2
2/2

15న స్పెషల్‌ లోక్‌ అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement