కలహాల కాపురం
● మహిళా పోలీస్‌స్టేషన్‌కు పెరుగుతున్న ఫిర్యాదులు
● పెళ్లయిన ఏడాదిలోపే పోలీసులను ఆశ్రయిస్తున్న వైనం
● అనుమానం, వివాహేతర సంబంధాలతో పెరుగుతున్న గొడవలు
వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లిసంబంధం. యువ దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా, భర్త ఆఫీస్ పోయేటప్పుడు భార్య ఆ రోజు వరకు ఉన్న ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాలింగ్ ఎంత ఉందో నోట్ చేసుకోవడంతో పాటు, కాస్త ఆలస్యంగా వచ్చినా.. ఆఫీసుకు సెలవు పెట్టి బయటకు వెళ్లినా అనుమానించడం సాధారణమైంది. తనతో పెళ్లి ఇష్టం లేకే ఇలా చేస్తోందని భర్త భావించాడు. అసలు విషయమేమిటో బోధపడక ముందు వీరి పంచాయితీ పెద్దల వరకు, అట్నుంచి మహిళ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.
ఇద్దరు ఉన్నత చదువులు పూర్తి చేశారు. మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. సోషల్‌మీడియాలో ఏర్పడిన స్నేహం పెళ్లివరకు వచ్చింది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఒకచోట చేరి కాపురం పెట్టిన ఇద్దరి మధ్య నెలకొన్న అనుమానాలతో ఆరు నెలలకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఠాణాకు చేరారు. ఇలా పెరిగిన సోషల్‌మీడియా వినియోగం, మైక్రో కుటుంబాలతో సర్ది చెప్పేవారు లేక కుటుంబాలు కూలుతున్నాయి.


