రోడ్‌సేఫ్టీ కోసం స్థల పరిశీలన
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రం పెద్దపల్లిలో రాజీవ్‌రోడ్డుపై ప్రమాదాలను నియంత్రించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పట్టణ ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలు, మలుపు తిరగడం కోసం పడుతున్న పాట్లను దృష్టిలో ఉంచుకుని ఏమేర విస్తరించాలి, అందుకు ఏ ప్రాంత స్థలాన్ని వినియోగించాలనే విషయమై మున్సిపల్, ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. గత నెల 30న కలెక్టరేట్‌లో జరిగిన రోడ్‌సేఫ్టీ సమావేశంలో చర్చించిన అంశాల మేరకు గురువారం పట్టణ ప్రధాన కూడళ్లను మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, గోదావరిఖని డీఎం నాగభూషణం, ట్రాఫిక్ సీఐ అనిల్‌కుమార్ పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బస్టాండ్, ప్రగతినగర్ ప్రాంతాల్లో బస్సులు ఫ్రీలెఫ్ట్ వెళ్లేలా, కారు, బైక్‌లు ప్రమాదాల బారిన పడకుండా రోడ్డు వెడల్పునకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించి పనులు ప్రారంభిస్తామనినేఈ సతీశ్ తెలిపారు. అధికారులు నరేశ్, వినయ్, కిరణ్, జగదీశ్ తదితరులున్నారు.


