సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కమాన్‌పూర్(మంథని): విద్యార్థులు సైబర్ నేరాలపై పూర్తిగా అవగహన కలిగి ఉండాలి రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మండలంలోని గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం సైబర్ నేరాలపై కమాన్‌పూర్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. కష్టపడి చదివి ఇష్టమైన ఉన్నత పదవిలో ఉండాలన్నారు. తాను కూడా సర్కారు బడుల్లో ఉన్నత చదువులు చదివి ఈ స్థాయిలో ఉన్నానని వివరించారు. విద్యార్థులు, మహిళల రక్షణకు షీటీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థినులను ఏవరైనా వేధిస్తే షీటీంకు సమాచారం ఇవ్వాలని, ప్రతి ఒక్కరు ఫోన్‌లో షీటీం ఫోన్‌నంబర్లు సేవ్ చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్, సైబర్ క్రైం ఏసీపీ డీవీ.రెడ్డి, గోదావరిఖని టూటౌన్ సీఐ నక్క ప్రసాద్, సైబర్ క్రైం సీఐ శ్రీనివాస్, కమాన్‌పూర్ ఎస్సై కొట్టే ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ పాల్గొన్నారు.
సీపీ అంబర్ కిషోర్ ఝా


