ఆర్‌ఎంవోగా కృపాబాయి
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్‌ఎంవో)గా కృపాబా యిని నియమిస్తూ వైద్య, ఆ రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కా ర్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మంచిర్యాల జిల్లాలో ప్రోగ్రాం ఆఫీసర్, మెటర్నల్ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కృపాబాయికి డిప్యూటీ సివిల్ సర్జన్ హోదా నుంచి సి విల్ సర్జన్‌గా పదోన్నతి కల్పిస్తూ ఆర్‌ఎంవోగా ని యమించారు. మనజిల్లాలో కృపాబాయి డిప్యూటీ డీఎంహెచ్‌వోగానూ పనిచేశారు. లాంగ్‌స్టాండింగ్ బదిలీల్లో భాగంగా ఏడాదిన్నర క్రితం మంచిర్యాల జిల్లాకు బదిలీపై వెళ్లారు.
దుర్వినియోగం చేస్తే చర్యలు
ఓదెల(పెద్దపల్లి): ఉపాధి పనులు, నిధులు దుర్విని యోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని అంబుడ్స్‌మన్ శరత్‌కుమార్ హెచ్చరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధిహామీ పనులపై స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. శరత్‌కుమా ర్ మాట్లాడుతూ, మొత్తం 22 గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనులకు రూ.4,97,87,230 ఖర్చుచేశారన్నారు. ఇందులో రూ.22,587 నిధులు దుర్వినియోగమయ్యాయన్నారు. వాటి రికవరికి ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో తిరుపతి, పీఆర్ ఏఈఈ సచిన్, ఏపీడీ సత్యనారాయణ, విజిలెన్స్ ఆఫీసర్ కొమురయ్య, ఎస్‌ఆర్‌పీ మౌనిక ఉన్నారు.
హోటళ్లల్లో తనిఖీలు
కోల్‌సిటీ(రామగుండం): నగరంలోని హోటళ్లు, టి ఫిన్ సెంటర్లను శానిటేషన్ అధికారులు మంగళవా రం తనిఖీ చేశారు. అపరిశుభ్రత, నాణ్యతలోపాల పై ఆరోపణలు వచ్చిన హోటళ్లను తనిఖీ చేసినట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, గోపు సంపత్ తెలిపారు. మార్కండేయకాలనీలోని ఓ హోటల్ ని ర్వాహకునికి జరిమానా విధించినట్లు తెలిపారు. వార్డు ఆఫీసర్ సాయి, సహాయ పర్యవేక్షకులు శ్రీనివాస్, సంపత్, అశోక్, శ్రావణ్ పాల్గొన్నారు.
ప్రైవేట్‌లోనూ ఉపాధి అవకాశాలు
పెద్దపల్లి: ప్రైవేట్ రంగాల్లోనూ ఉపాధి అవకాశాల ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి క ల్పనాధికారి రాజశేఖర్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం మెడ్‌ప్లస్ కంపెనీ నిర్వహించిన జాబ్‌మేళా కు నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.
క్వింటాల్ పత్తి రూ.6,858
పెద్దపల్లిరూరల్: వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,858 ధర పలికింది. కనిష్టంగా రూ.5,571గా నిర్ణయించారు.


