నేడు నృసింహుని కల్యాణం
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి లోని శ్రీలక్ష్మీ నరసింహస్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. జిల్లావాసుల ఆరాధ్యదైవమైన శ్రీలక్ష్మీనర్సింహస్వా మి బ్రహ్మోత్సవాలను ఏటా కార్తీకమాసంలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. క ల్యాణ తంతు నిర్వహణకు ఆలయ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, గ్రామపెద్దలు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు.
10న రథోత్సవం
ఈనెల 10న స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఉత్సవాలకు భక్తులు వచ్చే వాహనాలను నిలిపేందుకు వీలుగా పార్కింగ్ స్థలాలను పోలీసు అధికారులు పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చలువపందిర్లు వేయించడంతోపాటు తాగునీటి వసతి కల్పించామని ఆలయ ఈవో శంకరయ్య తెలిపారు.
రెండు రాష్ట్రాల భక్తుల రాక
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
నేడు నృసింహుని కల్యాణం


