ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు
ఓదెల(పెద్దపల్లి): రైల్వే ప్రయాణికులకు ఆధునికసౌకర్యాలు కల్పిస్తామని దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్‌ఎం) గోపాలకృష్ణన్ తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్‌ను డీఆర్‌ఎం మంగళవారం సందర్శించారు. నిత్యం రద్దీగా ఉండే ఓదెల రైల్వేస్టేషన్‌లో అన్నిసౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. బీజేపీ నాయకులు తాటికొండ వెంకటేశ్వర్లు, కృష్ణమాచారి, తీర్థాల కుమారస్వామి, అల్లెంకి శేషుమూర్తి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాగా, ఓదెలలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని బీజేపీ నాయకులు డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌కు విన్నవించారు. ఈమేరకు డీఆర్‌ఎంకు ఓదెల మల్లికార్జునస్వామి చిత్రపటం బహూకరించారు.
ఓదెల రైల్వేస్టేషన్ స్థాయి పెంపు
ఓదెల రైల్వేస్టేషన్ హాల్ట్‌స్టేషన్ స్థాయి నుంచి ఎన్‌ఎస్‌జీ– 4వ స్టేషన్‌స్థాయిగా పెరిగిందని సికింద్రా బాద్ రైల్వేశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనెజర్ భాస్కర్‌రెడ్డి పిన్‌రెడ్డి మంగళశారం ఉత్తర్వులు జారీచేశారు. ఓదెల మల్లికార్జునస్వామి భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
దక్షిణమధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణన్


