మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా
మంథని: పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పట్టణంలోని మంత్రి శ్రీధర్‌బాబు క్యాంపు కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఒకవైపు వర్షం కురుస్తున్నా నాయకులు నినాదాలు చేయడం ఆపలేదు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే పెండింగ్‌లోని రూ.8,025 కో ట్లను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశా రు. రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, నాయకులు సాయితేజ, లక్ష్మణ్, శశి, కల్యాణ్, తిరుపతి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్


