తుపాను.. పరేషాన్
నిలిచిన వరికోతలు రంగుమారుతున్న పత్తి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువకు లక్ష్య క్యూసెక్కులు విడుదల జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచన
సాక్షి పెద్దపల్లి/పెద్దపల్లి: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ ర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ఇప్పటికే కొ ద్దిరోజులుగా అడపాదడపా కురుస్తున్న వానలు రై తులకు శాపంగా మారగా.. తాజాగా తుపాను పీడకలలా వారిని వెంటాడుతోంది. తుపాన్ నేపథ్యంలో ఈదురుగాలుల ధాటికి కోతకు వచ్చిన వరిపైరు నేలవాలుతోంది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి పోసిన వడ్లు తడిసిపోయాయి. పత్తి నేలరాలి నల్లబారుతోంది. పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారు. ఆరుగాలం శ్రమ కళ్లెదుటే నీళ్లపాలవుతుంటే నిస్సాహాయ స్థితిలో ఉండిపోవడం తప్ప అన్నదాత ఏమీచేయలేక కన్నీటిపర్యంతమవుతున్నాడు.
స్తంభించిన జనజీవనం..
భారీవర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రామగుండం రీజియన్‌లోని సింగరేణి ఓపెన్‌కాస్ట్(ఓసీపీ) ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 12గేట్లు ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి వదులుతున్నారు. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల్లో గొర్రె లు, పశువులకాపరులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచనలు జారీచేశారు.
ఆగిన పంట కోతలు
వర్షాలతో పత్తి, వడ్లు, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పత్తికాయలు దెబ్బతింటుండటంతోపాటు ఇప్పటికే ఏరిన పత్తికి తేమ సమస్యగా మారింది. కూలీలను పెట్టి సేకరించిన పత్తిని ఇంటి కి తీసుకొచ్చినా .. మార్కెట్‌కు తీసుకువెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు తుపాను ప్రభావంతో వరి పైరు వాలింది. దీంతో రైతులు కోతలు వా యిదా వేస్తున్నారు. పంట కోస్తే వడ్లను ఎలా ఆరబెట్టాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. తెంపిన మక్కకంకులు చేలలోనే ఉండిపోయి వానలతో త డిసి ముద్దవుతున్నాయి. కంకులను ఎండబెట్టుకోలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అన్నదాతలు టార్పాలిన్ కవర్లు కప్పుతున్నారు. రేపో, మాపో వరి కోతలు చేద్దామనుకున్న రైతులు చేతికి అందివచ్చిన పంట వర్షాలకు నేలకొరుగుతుంటే చూసి లబోదిబోమంటున్నారు.
దూది రైతుకు దుఃఖం
మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురుగాలులు వీస్తున్నాయి. చలికి జనం వణికిపోతున్నారు. ఇలాంటి వాతావరణంలో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సేకరణ దశకు వచ్చిన పత్తి వర్షాలకు తడిసి చేలలోనే రాలిపోతోంది. పైగా తడిసి పత్తి రంగు మారుతోంది. ఫలితంగా దిగుబడి తగ్గిపోవడంతోపాటు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో పత్తి బస్తాలు
జిల్లా కేంద్రంలో జలమయమైన కాలనీ
దంచికొడుతున్న వాన
వర్షంలో వాహనదారుల ఇబ్బందులు
ఓదెల
98.5
సుల్తానాబాద్
76.8
కాల్వశ్రీరాంపూర్
68.3
పెద్దపల్లి
55.0
ఎలిగేడు
63.5
ధర్మారం
36.0
సుగ్లాంపల్లి
33.5
మంథని
62.3
భోజన్నపేట
32.0
ఎక్లాస్‌పూర్
27.0
కమాన్‌పూర్
44.5
రామగిరి
49.0
ముత్తారం
62.0
జూలపల్లి
41.0
రామగుండం
10.0
తుపాను.. పరేషాన్
తుపాను.. పరేషాన్
తుపాను.. పరేషాన్
తుపాను.. పరేషాన్


