పింఛన్ సర్టిఫికెట్లకు వేళాయె!
గోదావరిఖని: సింగరేణి రిటైర్డ్ కార్మికుల పింఛన్ నిలిచిపోకుండా సీఎంపీఎఫ్ అధికారులు దృష్టి సారించారు. ఆయా ఏరియాలకే అధికారులు వెళ్లి లైవ్‌సర్టిఫికెట్లు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం వచ్చేనెల 2 నుంచి 28వ తేదీ వరకు రామగుండం, బెల్లంపల్లి రీజియన్‌లో శిబిరాలు నిర్వహిస్తారు.
ప్రత్యేకంగా యాప్ కూడా..
సకాలంలో పింఛన్ పొందేందుకు మొబైల్‌ఫోన్ ఉన్నవారు ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఉమాంగ్ (UMANG) యాప్‌తోపాటు ఆధార్ ఫేస్ ఆర్‌డీ డౌన్‌లోడ్ చేసుకోలి. ఉమాంగ్‌యాప్‌లోని సర్వీస్ ఆప్షన్‌కు వెళ్లి పింఛ న్ హెడ్డింగ్‌లో లైవ్‌సర్టిఫికెట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవా లి. జనరేట్ లైవ్ సర్టిఫికెట్‌లో జనరేట్ లైవ్ సర్టిఫికెట్ ఎంచుకొని ఫేస్ రికగ్నైజ్‌డ్ ఆప్షన్ ఎంచుకోవాలి. జ నరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. దీంతో 6 అంకెల ఓ టీపీ వస్తుంది. దానిని ఓటీపీ ప్లేస్‌లో నమోదు చే యాలి. ఆధార్‌లో ఉన్నప్రకారం పేరు నమోదు చే యాలి. పింఛన్ పేమెంట్ ఆర్డర్ నంబర్ సరిగ్గా న మోదు చేయాలి. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు అయి తే సర్వీస్‌అని, కార్మికుడి భార్య అయితే ఫ్యామిలీ అని సెలక్ట్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్‌స్థానంలో సెంట్రల్ గోవ్‌ట్ అటానమస్/స్టాట్యుటరీ ఆర్గనైజేషన్/బాడీ/సొసైటీని సెలక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో కోల్‌మైన్స్ ఫావిడెంట్‌ఫండ్ ఆర్గనైజేషన్ అని ఆటోమెటిక్ వస్తుంది. ఏజెన్సీ నేమ్‌లో కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని ఆటోమెటిక్ వస్తుంది. అకౌంట్ నంబర్ ప్లేస్‌లో మీ పింఛన్ ఏ ఖాతా నంబర్‌లో జమ అవుతుందో ఆ అకౌంట్ నంబర్ నమోదు చేయాలి. దీంతో లైవ్ సర్టిఫికెట్ ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతుంది.
గోదావరిఖని కార్యాలయ సమాచారం
సర్టిఫికెట్ రెన్యూవల్ శిబిరాలు
ఏరియా నెల తేదీలు
ఆర్జీ–1 నవంబర్ 3, 4
ఆర్జీ–2 నవంబర్ 6, 7
ఆర్జీ–3 నవంబర్ 10, 11
శ్రీరాంపూర్ నవంబర్ 12, 13
మందమర్రి నవంబర్ 17, 18
భూపాలపల్లి నవంబర్ 19, 20
బెల్లంపల్లి, గోలేటి నవంబర్ 24, 25
ఈశ్వరకృప వృద్ధాశ్రమం నవంబర్ 26
సీఎంపీఎఫ్ ఆఫీస్ నవంబర్ 3 – 28
మొత్తం పింఛన్‌దారులు 68,886
లైవ్‌సర్టిఫికెట్ ఇవ్వనివారు 3,090
ప్రస్తుతం పింఛన్‌దారులు 66,796
పింఛన్ సర్టిఫికెట్లకు వేళాయె!


