రోడ్లపై పశువులు.. ఇబ్బందుల్లో ప్రజలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై పశువులు తిష్టవేస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో వాటిని గమనించక ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు ట్రాఫి క్ పోలీసులు.. ఆవుల కొమ్ములకు రేడియం స్టిక్లర్లు కూడా వేయించారు. అయినా ఫలితం కనిపించడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా..
మెయిన్ రోడ్లపై పశువులు యథేచ్ఛగా సంచరించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కొందరు ఇటీవల కలెక్టర్ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లారు. యజమానులు వాటిని తీసుకెళ్లేలా చూడాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈక్రమంలోనే తీసుకెళ్లకపోతే గోశాలకు తరలించి యజమానులకు రూ.10వేల జరిమానా విధించేలా మున్సిపల్ అధికారులు కార్యచరణ చేపట్టారు.
ఎన్నిసార్లు చెప్పినా?
పశువులను రోడ్లపై వదిలిపెట్టరాదని అధికారులు, సిబ్బంది అనేకసార్లు యజమానులకు సూచించా రు. హెచ్చరికలు కూడా చేశారు. కొంతకాలం క్రితం కొన్నిపశువులను గోశాలకు కూడా తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయినా యజమానుల్లో మార్పు కనిపించడంలేదు.
ప్రధాన రహదారులపై తిష్ట..
ప్రధాన మార్గాల్లోనే పశువులు తిష్టవేయడమే కా కుండా డివైడర్ల మధ్య, కాలనీల్లోని నివాసాల్లో పెంచుకుంటున్న చెట్లు, మొక్కలను పశువులు తినేస్తున్నాయి. ఈ విషయంపై అధికారులకు అనేక ఫిర్యాదులూ వస్తున్నాయి.
యజమానులకు జరిమానా
కోల్‌సిటీ(రామగుండం): పశువులు రోడ్లపైకి వ స్తే వాటి యజమానులకు రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తామని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ హెచ్చరించారు. పశువులు రోడ్లపై సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత సెప్టెంబర్ 23వ తేదీ నుంచి రోడ్లపై సంచరిస్తున్న గోవులను సంజయ్‌గాంధీనగర్‌లోని గోశాలకు ఇప్పటి వరకు 77 పశువులను తరలించగా.. యజమానులు జ రిమానా చెల్లించి 31 పశువులను తీసుకెళ్లినట్లు తెలిపారు. తమ పశువులను గోశాల నుంచి విడిపించుకోవడానికి ఇకనుంచి రూ.10వేల చొప్పు న జరిమానాతోపాటు నిర్వహణ వ్యయం కింద రోజూ రూ.250 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు రోడ్లపై తిరుగుతున్న గో వులనే గోశాలకు తరలించగా, ఇకముందు రోడ్లు కనిపిస్తే గేదెలనూ తరలిస్తామన్నారు.


