భూసమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై అదనపు కలెక్టర్ వేణుతో కలిసి తన కార్యాలయంలో బుధవారం కలెక్టర్ శ్రీహర్ష సమీక్షించారు. భూభారతి, సాదాబైనామా, మీ సేవా దరఖాస్తులు, ఎస్‌ఐఆర్ ఓటర్ జాబితా, అసైన్డ్ భూసమస్యలు తదితర అంశాలపై అధికారులకు పలుసూచనలు చేశారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వర గా పరిష్కరించాలన్నారు. సాదాబైనామాలు పరిశీలించి అర్హత ఉన్నవాటికి పట్టాలు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు, దేవాదాయ, తదితర రిజిస్ట్రేషన్ చేయకూడని భూముల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ డెస్క్ పని శనివారం నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులతో రోడ్డు అభివృద్ధి పనులపై చర్చించారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు భూ సర్వే పనులు సకాలంలో పూర్తికావాలని తెలిపారు. కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పెండింగ్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రామగుండం – మారేడుపాక ఆర్ అండ్ ఆర్ కాలనీ పనులు పూర్తిచేయాలని అన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, తహసీల్దార్లు రవీందర్ పటేల్, సునీత, రాకేశ్, యాకయ్య, జగదీశ్వర్‌రావు, రాజయ్య, సుమన్, సుధీర్, షఫీ పాల్గొన్నారు.
స్వచ్ఛ గ్రామాలు లక్ష్యం..
గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. తన కార్యాలయంలో పంచాయతీ శాఖ పనితీరుపై ఆయన సమీక్షించారు. నవంబర్ 3 నుంచి 11వతేదీ వరకు ప్రతీగ్రా మంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని, ప్లా స్టిక్ వ్యర్థాలు లేకుండా చూడాలని, ప్రజలు బయట చెత్తవేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధా న్యం ఇవ్వాలని ఆదేశించారు. నవంబర్ 7వ తేదీవరకు కనీసం 60శాతం ఆస్తిపన్ను వసూలు చేయా లని అన్నారు. ఇంటింటికీ సురక్షిత తాగునీరు సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య పాల్గొన్నారు.


