పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
గోదావరిఖనిటౌన్: కార్తీక మాసం సందర్భంగా గోదావరిఖని నుంచి వివిధ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తుందని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. నవంబర్ 4న యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, కొలనుపాక(ఒకరోజు ప్యాకేజీ) పెద్దలకు రూ.1,100, పిల్లలకు రూ.800 టికెట్ చార్జీలు నిర్ణయించామన్నారు. 6, 19న(రెండురోజుల ప్యాకేజీ) శ్రీశైలం వరకు పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1, అదేవిధంగా 11న(ఆరు రోజుల ప్యాకేజీ) పళని, పాతాళశంభు, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, జోగులాంబ ఆలయాల దర్శనానికి పెద్దలకు రూ.8,000, పిల్లలకు రూ.6,000, నవంబర్ 23న(5రోజుల ప్యాకేజీ) రాంటెక్ ప్రయాగరాజ్, వారణాసి, అయోధ్య, హైహార్, చాందామహాంకాళి ఆలయాల దర్శనం ఉంటుందని, పెద్దలకు రూ. 6,600, పిల్లలకు రూ.5,000 చార్జీలు నిర్ణయించామని పేర్కొన్నారు. త్వరలో పూరి, కుకి సుబ్రహ్మణ్యస్వామి, షిర్డీ పుణ్య క్షేత్రాలకు బస్సులు నడుపుతామన్నారు. 35మంది కన్నా అధికంగా ఉంటే కోరుకున్నచోటు కు బస్సు పంపిస్తామని, వివరాలకు 70135 049 82, 73828 47596, 79898 47927, 99081 380 36 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
నేడు వైట్‌కోట్ వేడుక
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్ –ప్రభుత్వ) కాలేజీలో వైద్యవిద్యలో తొలిఅడుగు వేస్తున్న ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం గురువారం వైట్‌కోట్ వేడుక, క్యాడావరిక్ ఒత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ నరేందర్ తెలిపారు. వైట్‌కోట్ ధరించడం ద్వారా ‘సేవా దృక్పథం, నైతిక విలువలతోపాటు బాధ్యత’పై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, కలెక్టర్ శ్రీహర్ష, సీపీ అంబర్ కిశోర్ ఝా హాజరుకానున్నారన్నారు. కలెక్టర్‌తోపాటు సీపీని బుధవారం కలిసిన నరేందర్, జీజీహెచ్ ఆర్‌ఎంవో రాజు.. సిమ్స్‌లో జరిగే వైట్‌కోట్ కార్యక్రమాలకు హాజరు కావాలని ఆహ్వానించారు.
హిందూ ధర్మం గొప్పది
పెద్దపల్లిరూరల్: ‘తల్లిఒడి పిల్లలకు తొలిబడి.. ఆ పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలతోపా టు హిందూ ధర్మం గురించి చెబుతూనే స్వయంకృషితో ఆర్థికాభ్యున్నతి సాధించాలని వీహెచ్‌పీ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల్ల సత్యం, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రావు అన్నా రు. విశ్వహిత సేవాట్రస్టు ద్వారా ఉచితంగా కు ట్టుశిక్షణ పొందిన 35మంది మహిళలకు బుధవా రం జిల్లా కేంద్రంలో ధ్రువీకరణపత్రాలు అందించి మాట్లాడారు. ప్రతినిధులు రాజేందర్‌రెడ్డి, ర వీందర్, సత్యం, మహేందర్, విజయలక్ష్మి, రమే శ్, ము రళీమోహన్, రవి, కవిత, శ్రీవాణి, వేదశ్రీ, శ్రీవాణిరెడ్డి, విజయలక్ష్మి పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): బోనస్, అలవెన్స్ లు చెల్లించాలనే డిమాండ్‌తో ఆర్‌ఎఫ్‌సీ ఎల్ కర్మాగారం ఎదుట బుధవారం కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ మజ్దూర్ యూనియ న్ నాయకుడు నరేశ్ మాట్లాడుతూ, కార్మికులకు డస్ట్ అలవెన్స్, బోనస్ చెల్లించడం లేదన్నారు.
పత్తి ధర రూ.6,675
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం 808 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశా రని ఇన్‌చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు. 292 మంది రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసి నట్లు పేర్కొన్నారు. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,675 గరిష్ట ధర పలికిందన్నారు.
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
గురువారం నుంచి ఆదివారం వరకు వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్టు మనోహర్ తెలిపారు. మోంథా తుపాన్ నేపథ్యంలో కురుస్తున్న ఎడతెరపిలేని వానలతో ఈ నిర్ణ యం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
విధుల నుంచి తొలగింపు
పెద్దపల్లి/కమాన్‌పూర్: కమాన్‌పూర్ మండలం రొంపికుంట జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం.తిరపతిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో అవు ట్ సోర్సింగ్ ఉద్యోగ సేవలను టర్మినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
31వరకు గడువు పొడిగింపు
పెద్దపల్లి: పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్‌ల కోసం దర ఖాస్తు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించామని మైనార్టీ సంక్షేమాధికారి రంగారెడ్డి తెలి పారు. https://te langa naepas s.cgg.gov. inవెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు.
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు


